కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పాదయాత్రలు చేసినా... పొర్లుదండాలు పెట్టినా ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్రెడ్డి తెలిపారు.
తిరుపతి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పాదయాత్రలు చేసినా... పొర్లుదండాలు పెట్టినా ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్రెడ్డి తెలిపారు. శనివారం తిరుపతిలో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించడంపై భానుప్రకాశ్రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే రాష్ట్రం అంధకారంగా మరిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరిగిన కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని భానుప్రసాద్ రెడ్డి విమర్శించారు.