వైభవంగా భూతప్పల ఉత్సవం | bhuthappala uthsavam | Sakshi
Sakshi News home page

వైభవంగా భూతప్పల ఉత్సవం

Published Fri, Mar 17 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

వైభవంగా భూతప్పల ఉత్సవం

వైభవంగా భూతప్పల ఉత్సవం

రొళ్ల : మండల కేంద్రంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  భూతప్పల ఉత్సవాలను అత్యంత వైభవంగా శుక్రవారం నిర్వహించారు. మారుతీకాలనీ సమీపంలో ముత్తురాయస్వామి ఆలయంలో భూతప్పలకు ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో పాదాలబండ వద్ద నుంచి భూతప్పలు నృత్యం చేసుకుంటూ ఆలయం వద్దకు వచ్చారు. తడివస్త్రాలతో మహిళలు పొర్లు దండాలు పెడుతుండగా భూతప్పలు నాట్యమాడుతూ వారిపై కాలుమోపుతూ ముందుకు సాగారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఉత్సవాలకు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భూతప్పలు చేరుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం భూతప్పల ఆలయంలో  పట్టం కూర్చోబెట్టారు. ఆలయ కమిటీ తరఫున అన్నదానం చేశారు. సీఐ దేవానంద్‌ ఆధ్వర్యంలో రొళ్ల, అగళి ఎస్‌ఐలు నాగన్న,రామ్‌బాబు  పోలీసు గట్టి బందోబస్తు నిర్వహించారు. అనంతరం ఎం.రాయాపురం గ్రామస్తులు శ్రీరామ ఆలయం సమీపంలోని లక్ష్మీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, భక్తులకుఅన్నదానం చేశారు. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  భక్తులు సమర్పించిన వడిబియ్యం, బెల్లం తదితర వాటితో ప్రసాదాన్ని తయారు చేసి భూతప్ప ఆలయం ముందు ఉంచి పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం బక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement