Roddam
-
‘సేంద్రియ’మే బెస్ట్
పంట సాగులో శాస్త్రీయత పురాతన పద్ధతులే శ్రేయస్కరమని నిరూపిస్తున్న అన్నదాతలు పర్యావరణ పరిరక్షణకు దోహదమంటున్న శాస్త్రవేత్తలు ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ అనే ఆంశం అన్ని వర్గాల్లోనూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వాతావరణ కాలుష్యం వల్ల నెలకుంటున్న ఆందోళనకర పరిస్థితులు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. రసాయనిక క్రిమి సంహారక మందుల వినియోగం వల్ల పర్యావరణానికి ఎక్కువగా హాని జరుగుతోందనేది శాస్త్రీయంగా నిరూపితమైంది. ఈ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయంతో పర్యావరణ కాలుష్యం నివారణ సాధ్యమన్న విషయాన్ని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. దీంతో పర్యావరణ పరిరక్షణపై ప్రజలను చైతన్యపరిచేందుకు టింబక్టు కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ చర్యలు చేపట్టింది. - రొద్దం: నేల, నీటిని సంరక్షిస్తూ.. భూసారాన్ని పెంచే విధానాలపై రైతుల్లో రొద్దంలోని టింబక్టు సంస్థ చైతన్యం తీసుకువస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా ధరణి సొసైటీ పేరుతో ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఆ సంస్థ ఏర్పాటు చేసింది. సుస్థిర వ్యవసాయం దిశగా రైతులను నడిపిస్తూ పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టింది. సేంద్రియ ఎరువుల తయారీ, వినియోగంపై ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. ధరణి సొసైటీ పర్యవేక్షణలో రొద్దం మండల వ్యాప్తంగా మండల వ్యాప్తంగా 140 మంది రైతులు 430 ఎకరాల్లో ఆరకులు, 129 ఎకరాల్లో కొర్ర, 30 ఎకరాల్లో బరిగ, 210 ఎకరాల్లో నూనె గింజలు, 530 ఎకరాల్లో వేరుశనగ, 30 ఎకరాల్లో పెసర పంటల సాగు చేపట్టారు. ఈ పంటలన్నీ సేంద్రియ ఎరువులతోనే సాగు చేయడం గమనార్హం. రసాయన ఎరువుల దుష్పలితాలు ఆరు దశాబ్దాల క్రితం కేవలం సేంద్రియ ఎరువులతోనే ఆహార ధాన్యాలను రైతులు ఉత్పత్తి చేసేవారు. ఆ తర్వాత వచ్చిన హరిత విప్లవం కారణంగా రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగం పెరిగిపోయింది. అప్పటి పరిస్థితులను బట్టి రసాయనిక ఎరువుల వినియోగంపై రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అప్పటి ప్రభుత్వాలకు దాదాపు 39 సంత్సరాలు పట్టింది. రసాయన ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడడంతో భూములు నిస్సారంగా మారి, వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ముప్ప అని తెలిసినా.. ప్రభుత్వాలే హరిత విప్లవం పేరుతో రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగాన్ని అప్పట్లో ప్రోత్సహిస్తూ వచ్చాయి. భూమిలో ఏముంది? సారవంతమైన భూమిలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి భూమిలోని సేంద్రియ పదార్థాన్ని కుళ్లింపజేసి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తుంటాయి. రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని మొక్క వేర్ల బుడిపెలలో నిల్వ చేసి మొక్కలకు అవసరమైనప్పుడు అందిస్తూ ఉంటుంది. మరికొన్ని రకాల సూక్ష్మజీవులు నేలలోని అనేక మలినాలను మొక్కలకు కావాల్సిన పోషకాలుగా మారుస్తుంటాయి. అంతేకాక ఇవి మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడినప్పుడు పంటలకు మేలు చేస్తున్న కొన్ని సూక్ష్మజీవులు అంతరించిపోతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రసాయనిక క్రిమి సంహారక మందుల వినియోగం పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటికి బదులు భూసారాన్ని పెంచే సేంద్రియ ఎరువులు, కషాయాల వినియోగం సుస్థిరమని శాస్త్రవేత్తలు సైతం పేర్కొంటున్నారు. సేంద్రియ ఎరువులు అంటే.. దిబ్బ ఎరువు, వర్మీ కంపోస్టు, ఆకులు అలములు, పొడి జీవామృతం, పంచగవ్వ లాంటివి భూమిలో సూక్ష్మక్రిములను పెంచి పోషించడమే కాకుండా భూమిని సారవంతం చేయడంలో తోడ్పడుతాయి. వీటిని సేంద్రియ ఎరువులుగా పిలుస్తుంటారు. తెగుళ్ల నివారణకు కషాయం సుస్థిర వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వినియోగంతో పాటు సేంద్రియ విధానంలోనే తయారు చేసిన కషాయాలను పిచికారీ చేయడం ద్వారా తెగుళ్ల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. విష తుల్యంకాని ఈ కషాయాలు పురుగులను చంపకుండా పొలాలనుంచి వాటిని తరిమేస్తుంటాయి. పంటను పురుగులు ఆశించకుండా కాపాడుతాయి. ఈ కషాయాలు మన చుట్టుపక్కల దొరికే వనరులతో తయారు చేసుకోవచ్చు. ఆకులతో తయారు చేసే కషాయం పంటను ఆశించి ఆకు తినే పురుగులు, రసం పీల్చు పురుగులను నివారిస్తుంది. కషాయాల తయారీ ఇలా.. ఆకులపై గుడ్లు పెట్టకుండా చేస్తుంది. పశువులు మేయనివి, పాలుకారేవి, చేదైన తదితర ఐదురకాల ఆకులను తీసుకుని ముద్దలా నూరి తొట్టిలో వేయాలి. ఈ ముద్ద మునిగిపోయే వరకూ పశువుల గంజు పోయాలి. రోజుకు ఒకసారి కర్రతో కలియతిప్పుతూ ఐదు రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టి, ఒక లీటరు కషాయాన్ని పది లీటర్ల నీటిలో కలుపుకుని పంటలపై పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే అందులో అర కిలో కారం పొడి లేదా, పావు కిలో పసుపు పొడి కలపుకుని వాడుకోవాలి. వేపకషాయం పిచికారీ చేస్తే 150 రకాల పురుగులు పంటలను ఆశించకుండా పరుగులు తీస్తాయి. 10 కిలోల వేపగింజలను మెత్తగా రుబ్బి పిండి చేసి మూటలో కట్టి బకెట్ నీళ్లలో ఒక రాత్రంతా నానబెట్టాలి. అనంతరం మూట నుంచి ద్రావణాన్ని పిండి, 100 గ్రాముల సబ్బుపొడి, 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరం పొలంలో పిచికారీ చేయాలి. ఒక లీటరు నీటికి 30 మి.లీటర్ల వేపనూనె, సబ్బు పొడి కలిపి పిచికారీ చేస్తే ఆకుముడత, పేనుబంక, తెల్లదోమ, కాండం తొలిచే పురుగులు నివారణ అవుతాయి. పంట పూతదశలో ఉన్నప్పుడు పది లీటర్ల మజ్జిగను పది రోజుల పాటు పులియబెట్టి, అందులో వంద గ్రాముల సీకాయపొడి కలిపి పెట్టుకోవాలి. ఈ ద్రావణం ఒక లీటరుకు పది లీటర్ల నీటిని కలిపి పంటలపై పిచికారీ చేస్తే పూత, గింజ నిలకడగా ఉంటాయి. 10 కిలోల పేడ, 10 లీటర్ల గంజు, 2 కిలోల కందిపిండి, 2 కిలోల బెల్లం, సారవంతమైన మట్టిని నీరుపోసి రెండు రోజులు ఒక డ్రమ్ములో మురగబెట్టడం ద్వారా వచ్చే జీవామృతాన్ని రోజుకు రెండు సార్లు ఈ ద్రావణాన్ని కలియపెడుతూ వారం రోజుల్లోపు వాడాలి. వడగట్టిన లీటరు ద్రావణానికి 10 లీటర్ల నీటిని కలుపుకుని పంటలపై పిచికారీ చేయాలి. ఐదు కిలోల పేడ, అరకిలో నెయ్యి, ఒక కిలో బెల్లం, పెరుగు కలిపి మూడు రోజులు నానబెట్టడం ద్వారా వచ్చే కషాయానికి నాల్గో రోజు మూడు లీటర్ల ఆవు గంజు, రెండు లీటర్ల ఆవు పాలు, రెండు లీటర్ల ఆవు పెరుగు కలపాలి. దీనిని ప్రతి రోజూ బాగా కలియతిప్పుతూ ఉంటే పంచగవ్వ ఔషధం తయారవుతుంది. ఇది ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది. మూడు లీటర్ల పంచగవ్వను 100 లీటర్ల నీటిలో కలుపుకుని పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. దీని పంట ఏపుగా పెరుగుతుంది. -
హామీలను హరించిన 420 చంద్రబాబు
– హంద్రీనీవా దివగంత నేత వైఎస్సార్ పుణ్యమే – విలేకరులతో జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ రొద్దం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను హరించిన 420 చంద్రబాబునాయుడు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన రొద్దం మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకుడు ఆర్ఏ రవిశేఖరరెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. హంద్రీనీవాకు తానే శంకుస్థాపన చేశానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో 2004 వరకు హంద్రీనీవా పునాది రాళ్లకే పరిమితమైన సంగతి ప్రజలకు తెలుసని చెప్పారు. దివగంత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనీవా పథకానికి శంకుస్థాపన చేసి రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్ చొరవతోనే జీడిపల్లి, గొల్లపల్లి ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. ఇప్పుడు కృష్ణాజలాలు అనంతకు వస్తుంటే వాటిని తానే తెచ్చానంటూ చంద్రబాబు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాజుల కాలంలో కట్టించిన చెరువులు వర్షం నీటితో నిండుతుంటే వర్షాలను తానే కురిపించానని సీఎం, మంత్రులు పక్కా ప్రణాళికతో జలహారతి పేరుతో ప్రజా సమస్యలను తప్పదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మారుతిరెడ్డి, జిల్లా అధికారి ప్రతినిధి చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు వజీర్‌బాషా, లక్ష్మీనారాయణరెడ్డి, కాటిమ తిమ్మారెడ్డి, సీనియర్ నాయకుడు రంగయ్య, మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు. -
రొద్దం ఎంపీపీ రాజీనామా !
అనంతపురం సిటీ : రొద్దం టీడీపీ ఎంపీపీ బోయ అంజినమ్మ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రామచంద్రకు రాజీనామా లేఖను అందజేశారు. తన వ్యక్తి గత కారణాలతోనే పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. కుటుంబ సమస్యలతో పాటు ఇతర వ్యక్తిగత కారణాల వల్ల పదవికి న్యాయం చేయలేక పోతున్నానని చెప్పారు. ఎంపీపీ అంజినమ్మ రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఏవైనా ఉన్నాయా? అని జెడ్పీ సీఈఓ రామచంద్రను ‘సాక్షి’ వివరణ కోరగా...అలాంటివేంలేవని ఆయన సమాధానమిచ్చారు. ఏవైనా అలాంటి కారణాలుంటే సభ్యురాలు తమకు ఫిర్యాదు చేస్తే చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వయంగా సభ్యురాలే తాను ఈ పదవి నుంచి తప్పుకుంటానని రాత పూర్వకంగా రాజీనామా పత్రం ఇచ్చినందువల్ల ఆ లేఖను స్వీకరించి ఆమె రాజీనామాను ఆమోదించామన్నారు. -
కనువిందుగా ఉట్ల పరుష
రొద్దం : మండల కేంద్రంలోని పెన్నానది ఒడ్డున వెలసిన గ్రామదేవత రొద్దకాంబదేవి 10వ జాతరోత్సవం ముగింపు సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ఉట్లపరుష కనువిందుగా సాగింది. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, రుద్రపాద శివునికి అలంకార పూజలు, ఆకుపూజ అలంకరణ చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి తరలివచ్చిన అశేష జన సందోహం నడుమ ఉట్లపరుషను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉట్లమాను ఎక్కడానికి యువకులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. చివరకు రొద్దం కంపల్లి గ్రామానికి చెందిన అంగజాల వంశీయుడు అంగజాల నరసప్ప కుమారుడు రాజేంద్ర అనే యువకుడు ఉట్లమాను ఎక్కాడు. ఆయనను డప్పు వాయిద్యాలతో గ్రామంలో ఊరేగించారు. ఈ వేడుకను తిలకించడానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా వచ్చారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ మున్నీర్‌అహ్మద్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వైభవంగా శివపార్వతుల అగ్నిగుండ ప్రవేశం
రొద్దం : మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రొద్దకాంబ రుద్రపాద 10వ జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం శివపార్వతుల అగ్నిగుండ ప్రవేశం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రస్వామి వేషాదారుల వీరగాసే నృత్యాలు అందరిని అలరించాయి. వారు వివిధ విన్యాశాలతో భక్తులు విసిరే టెంకాయలు, నిమ్మకాయలను ఖడ్గంతో ఒకే దెబ్బకు కొడుతూ అందరిని ఆశ్చర్య పరిచారు. అనంతరం వారు నృత్యాలు చేస్తూ అశేష జనసందోహం మధ్య అగ్ని గుండ ప్రవేశం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ మున్నీర్‌అహ్మద్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వైభవంగా జ్యోతుల ఉత్సవం
- పోటాపోటీగా ఎద్దుల బండ్ల ప్రదర్శన రొద్దం : మండల కేంద్రంలోని పెన్నానది ఒడ్డున వెలసిన పురాతన రుద్రపాద రొద్దకాంబదేవి 10వ జాతరోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం జ్యోతుల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. స్థానిక మహిళలు భక్తి శ్రద్ధలతో ఇంటికో జ్యోతిని తీసుకెళ్లి అంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. మొత్తం జ్యోతులన్నీ వచ్చాక ప్రదర్శనగా బయల్దేరి అమ్మవారి ఆలయానికి గుడిచుట్టూ మూడుసార్లు ప్రదక్షణలు చేశారు. అనంతరం జ్యోతులను గ్రామ దేవతకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జ్యోతులు మోస్తే కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉండటంతో యువతులు పెద్దఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. జ్యోతుల అనంతరం పెద్ద ఎత్తున ఆలయం చుట్టూ ఎద్దుల బండ్ల ప్రదక్షణలను రైతులు పోటాపోటీగా చేశారు. జాతరలో అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా ఎస్ఐ మున్నీర్‌అహ్మద్ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అశ్వర్థనారాయణ, జెడ్పీటీసీ చిన్నప్పయ్య, ఆస్పత్రి కమిటీ చైర్మన్ ఎంఎస్ నాగరాజు, ఆలయ, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. -
వైభవంగా భూతప్పల ఉత్సవం
రొళ్ల : మండల కేంద్రంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భూతప్పల ఉత్సవాలను అత్యంత వైభవంగా శుక్రవారం నిర్వహించారు. మారుతీకాలనీ సమీపంలో ముత్తురాయస్వామి ఆలయంలో భూతప్పలకు ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో పాదాలబండ వద్ద నుంచి భూతప్పలు నృత్యం చేసుకుంటూ ఆలయం వద్దకు వచ్చారు. తడివస్త్రాలతో మహిళలు పొర్లు దండాలు పెడుతుండగా భూతప్పలు నాట్యమాడుతూ వారిపై కాలుమోపుతూ ముందుకు సాగారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భూతప్పలు చేరుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం భూతప్పల ఆలయంలో పట్టం కూర్చోబెట్టారు. ఆలయ కమిటీ తరఫున అన్నదానం చేశారు. సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో రొళ్ల, అగళి ఎస్ఐలు నాగన్న,రామ్‌బాబు పోలీసు గట్టి బందోబస్తు నిర్వహించారు. అనంతరం ఎం.రాయాపురం గ్రామస్తులు శ్రీరామ ఆలయం సమీపంలోని లక్ష్మీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, భక్తులకుఅన్నదానం చేశారు. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు సమర్పించిన వడిబియ్యం, బెల్లం తదితర వాటితో ప్రసాదాన్ని తయారు చేసి భూతప్ప ఆలయం ముందు ఉంచి పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం బక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరు వేటగాళ్లు మృతి
-
విద్యుదాఘాతంతో ఇద్దరు వేటగాళ్లు మృతి
రొద్దం(అనంతపురం): పొలానికి రక్షణగా వేసిన విద్యుత్ కంచె తగిలి ఇద్దరు వేటగాళ్లు మృతిచెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రొద్దం మండలం శ్యాపురం గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రైతు గొల్ల అంజినప్ప తన పొలంపై అడవి జంతువులు దాడి చేయకుండా విద్యుత్ కంచె ఏర్పాటు చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి కర్ణాటకలోని హుస్సేనాపురం గ్రామానికి చెందిన ముగ్గురు వేటగాళ్లు అటుగా వచ్చి.. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. మృతులు హుస్సేనాపురం గ్రామానికి చెందిన బోయ నర్సింహులు, బోయ చిన్నప్పగా పోలీసులు గుర్తించారు. -
లైంగిక దాడికి యత్నం
రొద్దం : మండలంలోని గౌరాజుపల్లికి చెందిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం రాత్రి లైంగిక దాడికి యత్నించినట్లు గురువారం తమకు ఫిర్యాదు అ ందినట్లు ఎస్ఐ మునీర్ అహమ్మద్ తెలిపారు. రాత్రి 8 గంటలకు బహిర్భూమికని ఇంటి సమీపంలోని కంపచెట్లలోకి వెళ్లగా అక్కడే మాటు వేసి ఉన్న సదరు వ్యక్తి ఆమె చెయ్యి పట్టుకుని బలవంతంగా లాగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయగా అతను పారిపోయాడన్నారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
రొద్దం : మండలంలోని కంచిసముద్రంలో ఓ వివాహిత(25) బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. అటు భర్త, ఇటు ప్రియుడి చేష్టలతో విసుగెత్తిన ఆమె జీవితంపై విరక్తి చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ నరసింహులు తమ సిబ్బందితో కలసి గ్రామానికి చేరుకుని జరిగిన సంఘటనపై విచారణ చేశారు. -
రాష్ట్ర స్థాయి పోటీలను ఎంపిక
తురకలాపట్నం(రొద్దం) : తురకలాపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం జ్యోతిలత, పీఈటీ శ్రీదేవి సోమవారం తెలిపారు. ఈనెల 4న అనంతపురం ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఎంపికలో పద్మావతి, బాలాజిలు ప్రతిభ చూపారన్నారు. వీరు పశ్చిమగోదావరిలో ఈనెల 8న జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో తమ విద్యార్థులు సత్తాచాటినట్లు తెలిపారు. బాలికల జూనియర్స్ విభాగం బాల్‌బ్యాడ్మింటన్‌లో విన్నర్స్‌గా, సాఫ్ట్‌బాల్, టెన్నీకాయిట్లో రన్నర్స్‌గా గెలుపొందినట్లు తెలిపారు. బాలుర సీనియర్స్ కబడ్డీ, టెన్నీకాయిట్లలో రన్నర్స్ నిలిచినట్లు పేర్కొన్నారు. పెద్దమంతూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సచిన్‌టెండుల్కర్–6 జోన్ క్రీడాపోటీల్లో జూనియర్స్, సీనియర్స్ బాలబాలికల విభాగాల్లో 13 పతకాలు, 3 ట్రోఫీలు గెలుపొందినట్లు పాఠశాల హెచ్ఎం విజయకుమారి, పీఈటీ లక్ష్మినారాయణ తెలిపారు. -
‘కట్టలు’ తెంచుకున్న జనాగ్రహం
బత్తలపల్లి, రొద్దం మండలాల్లో రాస్తారోకో బత్తలపల్లి /రొద్దం : కరెన్సీ కష్టాలు తీరకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి మండల కేంద్రంలోనూ, రొద్దం మండలం పెద్దమంతూరు గ్రామంలోనూ ఆందోళనలు నిర్వహించారు. బత్తలపల్లిలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్ వద్దకు ఉదయమే వందలాదిమంది ఖాతాదారులు చేరుకున్నారు. బ్యాంకులో నగదు లేకపోవడంతో మేనేజర్ ఉమామహేశ్వర్ వర్దన్ ధర్మవరం, అనంతపురం బ్రాంచ్‌లకు ఫోన్ చేశారు. అక్కడా లేదని సమాధానం వచ్చింది. ఇదే విషయాన్ని ఖాతాదారులకు చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఇదే మాట చెబుతున్నారంటూ బ్యాంకు ఎదుట చెన్నై-ముంబాయి జాతీయ రహదారిపై అరగంట పాటు బైఠాయించారు. ఇరువైపులా వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బ్యాంకు మేనేజర్ వచ్చి తమ సమస్య తీర్చాలంటూ పట్టుబట్టారు. దీంతో ఆయన అక్కడికి చేరుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించామని, అనంతపురం నుంచి డబ్బు తెచ్చి కూపన్లు ఉన్నవారికి పంపిణీ చేస్తామని చెప్పారు. మిగిలిన వారికి ఇప్పుడు కూపన్లు ఇచ్చి మరుసటి రోజు నగదు పంపిణీ చేస్తామన్నారు. దీంతో ఆందోళన విరమించారు. అలాగే రొద్దం మండలం పెద్దమంతూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులకు నగదు లేదని చెప్పడంతో అక్కడే ధర్నాకు దిగారు. ఇంకెన్నాళ్లీ కష్టాలంటూ మండిపడ్డారు. తన కుమారుడికి ఛాతీనొప్పి రావడంతో బెంగళూరులోని ఆస్పత్రికి తరలించామని, రూ.20 వేల నగదు అవసరమై ఇక్కడికొస్తే లేదని చెబుతున్నారని కల్లకుంట గ్రామానికి చెందిన జయప్ప వాపోయారు. రెండు రోజుల్లో కుమార్తె వివాహం ఉందని, బ్యాంకులో డబ్బివ్వకపోవడంతో పెళ్లి ఆగుతుందేమోనన్న భయంతో ఉన్నానని గొబ్బిరంపల్లికి చెందిన గోవిందప్ప ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ మేనేజర్ భాస్కర్ స్పందిస్తూ బుధవారం రూ.5 లక్షలు రావడంతో కొందరు ఖాతాదారులకు ఇచ్చామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.20 లక్షలు వస్తే గానీ అందరికీ సర్దుబాటు చేయలేమన్నారు. చేసేదిలేక ఖాతాదారులు ధర్నా విరమించి..నిరాశతో వెనుదిరిగారు. -
మహిళ మృతి
రొద్దం: మండలంలోని సుబ్బరాయప్పకొట్టాలకు చెందిన వివాహిత శిల్ప(30) ఈనెల 5న ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తీవ్రగాయాలతో అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు జమేదర్ గోవిందప్ప తెలిపారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం?
రొద్దం: రొద్దం మండలం సుబ్బరాయప్పగారి కొట్టాలకు చెందిన శిల్ప(30) అనే వివాహిత బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు బంధువులు తెలిపారు. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో భర్త ఇంట్లో ఉండగా ఈ ఘటన జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరుగుపొరుగు వారు వెంటనే ఆమెను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోవిందప్ప కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవాలు ఏమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
కామ్రేడ్ శ్రీరాముల అంతిమ యాత్ర
రొద్దం : ప్రజా సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు చేస్తూ మండల ప్రజల మన్ననలు పొందిన సీఐటీయూ మండల క్యారదర్శి శ్రీరాముల అంతిమయాత్రలో జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి మండలంలోని పురవీధుల్లో శనివారం అంతిమ యాత్ర చేపట్టారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి రొద్దం నరసింహులు, మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మినారాయణరెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నరహరిప్రసాద్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్, నర్సింగరావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రాంభూపాల్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు హనుమంతరెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్, జిల్లా కార్యదర్శి వెంకటేశులు, పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు శ్రీరాములు మతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మతుడి కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటామన్నారు. -
కల్తీ కల్లు తాగి 25 మందికి అస్వస్థత
రొద్దం: మండలంలో కల్తీకల్లు తాగి 25 మంది అస్వస్థతకు గురయ్యారు. పి.రొప్పాలలో కల్తీ కల్లు తాగి 20 మంది అస్వస్థతకు గురి కా గా, నల్లూరులో మరో ఐదుగురు కల్తీ కల్లు తాగి వాంతులు, విరేచనాలకు గురయ్యారు. వారిలో ఎనిమిది మం ది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పి.రొప్పాల గ్రామస్తులు తెలిపారు. వారందరినీ హిందూపురం, పెనుకొండ, మడకశిర ఆస్పత్రులకు తరలించి నట్లు చెప్పారు. అంజినప్ప(50), సిద్దమ్మ(60), అంజినమ్మ(65), కిష్టప్ప(70), లక్ష్మినరసమ్మ(70), హెచ్.అంజినమ్మ(59), సిద్దన్నగారి లక్ష్మినరసమ్మ(70), తిప్పన్న(75), కదిరమ్మ(70), రామక్క(60), నరసమ్మ(67), వడుసలప్ప(73), కిష్టప్ప(90), నంజమ్మ(65) తదితరులు అస్వస్థతకు గురైన వారిలో ఉన్నారు. ఎక్సైజ్ సీఐ రేవతి, ఎస్ఐ శ్రీధర్ ఏమంటున్నారంటే... పి.రొప్పాలలో ప్రభుత్వ కల్లు దుకా ణం ఏర్పాటుకు మేం అనుమతి ఇవ్వలేదు. కర్ణాటక సరిహద్దు ప్రాం తం కావడంతో కల్తీ కల్లు ఎక్కడ తాగారన్న విషయం తెలియడం లేదు. విచారణ చేస్తున్నాం. -
సర్పాల సరస సల్లాపం
రొద్దం : మండల కేంద్రంలోని శ్మశానవాటికకు వెళ్లే దారిలోని పొలంలో ఆదివారం రెండు సర్పాలు సయ్యాటలాడాయి. పెనవేసుకుని అలా.. అలా.. ముందుకు సాగుతూ తన్మయత్వంలో మునిగిపోయాయి. అటువైపు రైతులు, కూలీలు వచ్చినా.. అలికిడి చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా కామకేళిలో మైమరచిపోయాయి. దాదాపు ఐదు గంటలపాటు సాగిన సర్పాల సరస సల్లాపాన్ని స్థానికులు ఆసక్తిగా వీక్షించారు.