బద్ధ శత్రువులు మిత్రులయ్యారు!
కాంగ్రెస్, టీడీపీలపై మంత్రి నాయిని ఫైర్
చిన్న చింతకుంట: నిన్నటి వరకు బద్ధశత్రువులుగా ఉన్న పార్టీలు నేడు ఏకమై టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై లేని అపోహలు సృష్టిస్తున్నాయని.. విపక్షాలకు ఇది తగదని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అల్లీపురంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ పాల నలో రైతులు కరెంటు సాగునీరు ఇచ్చి ఉంటే ఇప్పుడు రైతు లు ఇబ్బందులు ఎదుర్కొనేవారు కారన్నారు. కాంగ్రెస్, టీడీపీలు తమ ప్రభుత్వంపై నిందలు వేస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని చెప్పారు.
వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపినప్పుడు.. పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డుకుంటున్నప్పుడు ఈ పార్టీల ఐక్య ఉద్యమం ఎక్కడపోయిందని ప్రశ్నించారు. మోదీ సర్కారు రైతు వ్యతిరేక ప్రభుత్వమని రాహుల్ గాంధీ విమర్శిస్తుంటే తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీతో జతకట్టి బంద్‌లో పాల్గొనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.