బీజేపీని బలోపేతం చేయాలి
♦ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి
♦ ఘట్‌కేసర్‌లో కార్యకర్తల సమావేశం
ఘట్‌కేసర్ టౌన్: వచ్చే ఎన్నికల సమయానికి బీజేపీని బలమైన శక్తిగా తయారు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సంరద్భంగా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేలా ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. జిల్లా స్థారుు నుంచి బూత్ స్థారుు వరకు పార్టీని పటిష్టం చేయాలన్నారు. టీఆర్‌ఎస్ మాటల ప్రభుత్వమేనని ఎద్దేవాచేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని రూ.100 కోట్లతో 6 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత నాయకులు మాత్రం జిల్లాకు రావాల్సిన నీటిని మెదక్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. గోదావరి జలాలు మినహా గత్యంతరం లేదని ప్రాణహిత-చేవేళ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు-డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజకుక్టులపై నిర్ణయం తీసుకోకుండా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌తో జిల్లాను సస్యశ్యామలం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
హరితాహారం కార్యక్రమంలో నాటుతున్న కోట్ల మొక్కలను ఎవరు రక్షిస్తారని ప్రశ్నించారు. జిల్లాల విభజన శాస్తీయ్రంగా ఉండాలని, జిల్లాను యాదాద్రి కమిషనరేట్‌లో కలుపుతామనడం మంచిది కాదని సూచించారు. ఘట్‌కేసర్ కేంద్రాంగా ముఖ్యమైన కార్యలయాలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలను నగరంలో కలిపితే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కంభం లక్ష్మారెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి, ఎంపీటీసీ సభ్యుడు బిక్కునాథ్‌నాయక్, ఎంపీటీసీ సభ్యుడు కరుణాకర్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎదుగని శ్రీరాములు, జిల్లా ఉపాధ్యక్షుడు రామోజీ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రజని, మండల అధ్యక్షురాలు సుజాత, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రాణి, రఘువర్ధన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.