- పింఛన్ మాయాజాలం, బోగస్,అవినీతి
- వయసు 60... అయినా అర్హురాలేనట!
- రద్దు చేసినట్టుప్రకటించినా ఇంకా విడుదలవుతున్నసొమ్ము
- జన్మభూమి కమిటీల సిఫారసులే అవినీతికి కారణం
ఆగని..పింఛన్ మాయాజాలం
Published Thu, Feb 16 2017 12:10 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
కాకినాడ :
జన్మభూమి కమిటీ సభ్యుల సిఫారసుతో పింఛన్ల అవకతవకలు కొనసాగుతూనే ఉన్నాయి. పిఠాపురం మున్సిపాల్టీలో అక్కడి టీడీపీ నేతలు భార్యల పేరుతో ప్రతి నెలా వితంతు పింఛ¯ŒS డబ్బులు తీసుకున్న తంతును వరుస కథనాలతో ‘సాక్షి’ బయటపెట్టిన విషయం విదితమే. అక్కడ దర్యాప్తు జరుగుతుండగా జిల్లా కేంద్రం కాకినాడలో మరో పింఛను వంచన వ్యవహారం బయటపడింది. ఇక్కడ 69 ఏళ్లున్న వృద్ధుడి పేరుతో 60 ఏళ్లున్న మరో వ్యక్తికి నిబంధనలకు విరుద్ధంగా పింఛను మంజూరు చేయించేశారు. అసలు అర్హుడికి ఇవ్వకుండా అనర్హుడికి ఇవ్వడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అతని పేరుతో మరొకరికి పింఛ¯ŒS...
కాకినాడ 32వ డివిజ¯ŒSకు చెందిన 69 ఏళ్ల సారిపల్లి పెద అప్పారావు వృద్ధాప్య పింఛ¯ŒSకు అర్హత కలిగి ఉన్నాడు. అయితే అతని రేష¯ŒSకార్డుపై అదే డివిజ¯ŒSకు చెందిన 60 సంవత్సరాల బొడ్డు నూకరాజు పింఛ¯ŒS
పొందుతున్నాడు. వృద్ధాప్య పింఛ¯ŒS పొందాలంటే 65 ఏళ్లు ఉండాలన్న నిబంధన నేపథ్యంలో పెద అప్పారావు రేష¯ŒSకార్డు నంబర్‌తో బొడ్డు నూకరాజుకు పింఛ¯ŒS మంజూరు చేసేశారు. అర్హత కలిగిన పెద అప్పారావు తనకు పింఛ¯ŒS ఇవ్వండి మహాప్రభో అంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కల్పించలేదు సరికదా రికార్డుల్లో పరిశీలిస్తే సారిపల్లి పెద అప్పారావు రేష¯ŒSకార్డు నంబర్‌పై బొడ్డు నూకరాజు పింఛ¯ŒS పొందుతున్నట్టుగా ఉంది. ఇక అర్హత ఉన్న తన పరిస్థితి ఏమిటంటూ అప్పారావు గగ్గోలు పెడుతున్నాడు.
నూకరాజు కార్డుపై భార్యకు పింఛ¯ŒS
వేరొక కార్డుపై వృద్ధాప్య పింఛ¯ŒS పొందుతున్న బొడ్డు నూకరాజుకు సొంతంగా ఓఏపీ 104496846 పేరుతో రేష¯ŒSకార్డు ఉంది. ఈ రేష¯ŒSకార్డులో అతని భార్య అచ్చియ్యమ్మ వయస్సు 45 సంవత్సరాలుగా ఉంది. ఈ కార్డు నంబర్‌పై అచ్చియ్యమ్మ ఐడీ నెంబర్ 104806029 పేరుతో వృద్ధాప్య పింఛ¯ŒS పొందుతోంది.
రద్దయిన పింఛ¯ŒSకూ సొమ్ము విడుదల
ఇదే డివిజ¯ŒSకు చెందిన జన్మభూమి కమిటీ సభ్యుడు మేడిశెట్టి అప్పలరాజు ఇటీవల తన భార్య సత్యవతి పేరుతో వితంతు పింఛ¯ŒS మంజూరు చేయించుకున్నాడు. దీనిపై గత ఏడాది అక్టోబర్ 9న ‘పదవిలో పదిలం–పింఛ¯ŒS కోసం మరణం’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు ఆ పింఛ¯ŒSను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వితంతు పింఛ¯ŒS అందుకున్న మేడిశెట్టి సత్యవతి ఆ సొమ్మును కార్పొరేష¯ŒSకు స్వయంగా తీసుకువెళ్లి తిరిగి ఇచ్చేశారు. అయితే నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి ఆమె పేరుతో రూ. రెండు వేలు పింఛ¯ŒS మంజూరు చేసి, నేరుగా ఆమె ఖాతాకు జమ చేశారు. తాజాగా జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి కూడా ఆమె పేరుతో సొమ్ములు మంజూరైపోయాయి. పింఛ¯ŒS రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించినా యథావిధిగా సొమ్ములు విడుదలవుతున్న తీరు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అడ్డూ, అదుపూ లేకుండాపోతున్న ఇలాంటి అక్రమాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కార్పొరేష¯ŒS ప్రత్యేకాధికారి, కలెక్టర్ అరుణ్‌కుమార్, కమిషనర్ అలీంబాషాలను కోరుతున్నారు.
విచారించి చర్యలు
ఓ రేష¯ŒS కార్డుపై వేరొకరు పింఛ¯ŒS పొందుతున్నారన్న అంశం మా దృష్టికి రాలేదు. అలాగే వితంతు పింఛ¯ŒS సొమ్ము బ్యాంకులో జమయినట్టు వస్తున్న ఆరోపణలపై కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – భాస్కరరావు, టీపీఆర్వో
Advertisement