పరువు కోసం అన్న ఆత్మహత్య | brother suicide for dignity | Sakshi
Sakshi News home page

పరువు కోసం అన్న ఆత్మహత్య

Published Tue, Oct 18 2016 3:54 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

brother suicide for dignity

చెల్లెలు ప్రేమ వివాహం చేసుకున్నదని..
తూప్రాన్ : చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపంతో ఓ సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోసాన్ పల్లికి చెందిన ములుగు శ్రావణ్‌కుమార్‌రెడ్డి (24) తూప్రాన్ లో కొన్నేళ్లుగా తల్లి రాణి, చెల్లెలితో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. చెల్లెలు స్వాతికి నర్సాపూర్ మండలానికి చెందిన వ్యక్తితో ఈనెల 20న నిశ్చితార్థం ఏర్పాటు చేశారు.

 చెల్లెలు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోరుు ఆదివారం రాత్రి తూప్రాన్  పోలీసులను ఆశ్రరుుంచింది.  చెల్లెలు కులాంతర వివాహం చేసుకోవడంతో మనస్తాపం చెందిన శ్రావణ్ ఆదివారం రాత్రి బ్రాహ్మణపల్లి రైల్వేగేటు సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement