నేరాల కట్టడికి సీసీ కెమెరాలు
పాలకోడేరు : జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నేరాల కట్టడికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, వీటిని జిల్లా కేంద్రం ఏలూరుకు అనుసంధానించి ఓ డీఎస్పీ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమిస్తామని ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు.
పాలకోడేరు : జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నేరాల కట్టడికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, వీటిని జిల్లా కేంద్రం ఏలూరుకు అనుసంధానించి ఓ డీఎస్పీ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమిస్తామని ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు. మంగళవారం ఆయన శృంగవృక్షం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను, ఎన్టీఆర్ సుజల ఆర్వో ప్లాంటును ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, చోరీలు, ఇతర నేరాలనూ అరికట్టవచ్చని వివరించారు. ఇప్పటికే కొవ్వూరు, ఉండి తదితర చోట్ల దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. రానున్న కాలంలో జిల్లా అంతటా విస్తరిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. శృంగవృక్షం గ్రామ సర్పంచ్ కలిదిండి దుర్గాదీప్తిని అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, డీఎస్పీ జి.పూర్ణచంద్రర రావు, భీమవరం రూరల్ సీఐ జయసూర్య, ఉండి ఏఎంసీ చైర్మన్ కొత్తపల్లి గోపాలకృష్ణంరాజు, ఎంపీపీ పాలా వెంకటచలపతి, సర్పంచ్ కలిదిండి దుర్గాదీప్తి, కలిదిండి కృష్ణంరాజు, సర్పంచ్‌ల ఛాంబర్ అధ్యక్షుడు గాదిరాజు సూర్యనారాయణరాజు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఆరేడులో.. ఉండి : ఉండి మండలం ఆరేడులో గణపవరం ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలనూ ఎమ్మెల్యే శివరామరాజుతో కలిసి ఎస్పీ ప్రారంభించారు. కార్యక్రమంలో మండల సర్పంచ్‌ల చాంబర్ అధ్యక్షుడు జుత్తిగ శ్రీనివాస్, ఎంపీపీ డలియా లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యులు కె సత్యతులసి, సర్పంచ్ పి.పోలేశ్వరరావు, వి.సుజాత తదితరులు పాల్గొన్నారు.