కారు, బైక్‌ ఢీకొని నలుగురికి గాయాలు | Car bike collide four injuries | Sakshi
Sakshi News home page

కారు, బైక్‌ ఢీకొని నలుగురికి గాయాలు

Published Mon, Aug 15 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

Car bike collide four injuries

రామాపురం:  కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిలోని రామాపురం మండలం బండపల్లె పంచాయతీ పరిధిలో ఓ పెట్రోలు బంకు సమీపాన ఆదివారం కారు – బైక్‌ ఢీకొని నలుగురు గాయాల పాలయ్యారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చింతకొమ్మదిన్నె మండలం జమాల్‌పల్లెకు చెందిన ఆంజనేయులు, ఆయన భార్య సుజాత, పిల్లలు గౌతమ్, తేజ రాయచోటి కస్తూర్బా బాలికల పాఠశాలకు వెళ్లి తిరిగి జమాల్‌పల్లెకు బైక్‌పై వస్తుండగా.. రాయచోటి నుంచి కడప వైపునకు వెళ్తున్న టాటా ఏస్‌ కారు వెనుక వైపు నుంచి ఢీకొంది. సంఘటన స్థలానికి రామాపురం పోలీసులు చేరుకొని బాధితులను 108 వాహనం ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ సుబ్బరాయుడు తెలిపారు. సంఘటన స్థలానికి మండల టీడీపీ అధ్యక్షుడు యర్రబోలు శేఖర్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు సూరం వెంకటసుబ్బారెడ్డి, ప్రశాంతరెడ్డి, టీడీపీ నాయకుడు రాజశేఖర్‌ తదితరులు చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించడంలో సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement