యువతిని మోసగించిన టీడీపీ జడ్పీటీసీ భర్త
రాజమండ్రి: టీడీపీ నాయకురాలి భర్త తనను మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. సీఐ వైఆర్కే నివాస్ కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా అయినవెల్లి టీడీపీ జడ్పీటీసీ భర్త ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఆమె నుంచి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు వసూలుచేశాడు.
అయితే ఎన్నిరోజులు చూసినా జడ్పీటీసీ భర్త తనకు ఉద్యోగం ఇప్పించకపోవడంతో మోసపోయానని యువతి గ్రహించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ వైఆర్కే నివాస్ వెల్లడించారు.