చెక్‌పోస్టులో నగదు రహిత సేవలు
-
ఎంవీఐ చంద్రశేఖర్‌రెడ్డి
బీవీపాళెం(తడ): బీవీపాళెం చెక్‌పోస్టు రవాణాశాఖ వద్ద ఇకపై నగదు రహిత సేవలు అమలు చేసేందుకు గాను పీఓఎస్ టెర్మినల్ మిషన్ ద్వారా టాక్స్‌లు, జరిమానాలు వసూలు చెయ్యనున్నట్టు ఎంవీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎంవీఐ తెలిపిన వివరాల మేరకు పెద్ద నోట్ల రద్దు కారణంగా బీవీపాళెం చెక్‌పోస్టు రవాణా శాఖ కార్యాలయం వద్ద 1000, 500 నోట్లను అధికారులు తీసుకోవడం లేదు. ఈ నేపధ్యంలో ఇక్కడకు వచ్చే వాహనదారులు కొత్త నోట్లు లేదా చిల్లర నోట్లను తెచ్చి ఇచ్చేందుకు వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపద్యంలో ఈ మిషన్ వినియోగించి నగదు బదిలీ చెయ్యడం ద్వారా సేవలు కొనసాగించవచ్చని ఆయన తెలిపారు. ఎస్‌బీఐ బ్యాంక్ సమకూర్చిన ఈ మిషన్లు నెల్లూరు, గూడూరు, బీవీపాళెం కార్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.