BV Palem checkpost
-
చెక్‌పోస్టులో స్వైపింగ్ మిషన్ సేవలు ప్రారంభం
బీవీపాళెం(తడ): బీవీపాళెం చెక్‌పోస్టులోని రవాణాశాఖ కార్యాలయంలో స్వైపింగ్ మిషన్లను శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చారు. వాహనాల వాహనదారులు డెబిట్ కార్డు ద్వారా పన్నులు, ఇతర లావాదేవీలు జరిపేలా స్వైపింగ్ మిషన్ల సేవలను అమల్లోకి తీసుకువచ్చారు. శుక్రవారం వేకువ జామున వచ్చిన ఓ వాహన దారుడు నగదు చెల్లింపును కార్డు ద్వారా చేసేందుకు ముందుకు రాగా ఎంవీఐ చంద్రశేఖర్‌రెడ్డి స్వైపింగ్ మిషన్ ద్వారా నగదు జమ చేసుకుని రసీదును అందజేశారు. వాహనదారులకు అవగాహన కల్పించి భవిష్యత్తులోనూ నగదు రహిత లావాదేవీలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఎంవీఐ తెలిపారు. -
సిగరెట్ల లారీ నిలిపివేత
బీవీపాళెం(తడ): ఇటీవల వైజాగ్‌లో గోల్డ్ఫ్లాక్ సిగరెట్ల లారీ అపహరణకు గురైన నేపధ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం తనిఖీలు నిర్వహించిన తడ ఎస్ఐ సురేష్‌బాబు బీవీపాళెం చెక్æపోస్టు వద్ద ఓ కంటైనర్‌ని పట్టుకున్నారు. నాగాలాండ్ నుంచి చెన్నై వెళుతున్న ఈ కంటైనర్‌లోనూ గోల్డ్ఫ్లాక్ సిగరెట్లు తరలిస్తూ ఉండటంతో అనుమానంతో రికార్డులు స్వాదీనం చేసుకుని లారీని చెక్‌పోస్టు వద్ద నిలిపారు. ఈ లారీ, సరుకుకి సంబందించి పూర్తి వివరాల కోసం యజమానిని తడకు పిలిపించారు. వివరాలు తెలిపిన తరువాత లారీని పంపుతామని ఎస్ఐ తెలిపారు. -
చెక్‌పోస్టులో నగదు రహిత సేవలు
ఎంవీఐ చంద్రశేఖర్‌రెడ్డి బీవీపాళెం(తడ): బీవీపాళెం చెక్‌పోస్టు రవాణాశాఖ వద్ద ఇకపై నగదు రహిత సేవలు అమలు చేసేందుకు గాను పీఓఎస్ టెర్మినల్ మిషన్ ద్వారా టాక్స్‌లు, జరిమానాలు వసూలు చెయ్యనున్నట్టు ఎంవీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎంవీఐ తెలిపిన వివరాల మేరకు పెద్ద నోట్ల రద్దు కారణంగా బీవీపాళెం చెక్‌పోస్టు రవాణా శాఖ కార్యాలయం వద్ద 1000, 500 నోట్లను అధికారులు తీసుకోవడం లేదు. ఈ నేపధ్యంలో ఇక్కడకు వచ్చే వాహనదారులు కొత్త నోట్లు లేదా చిల్లర నోట్లను తెచ్చి ఇచ్చేందుకు వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపద్యంలో ఈ మిషన్ వినియోగించి నగదు బదిలీ చెయ్యడం ద్వారా సేవలు కొనసాగించవచ్చని ఆయన తెలిపారు. ఎస్బీఐ బ్యాంక్ సమకూర్చిన ఈ మిషన్లు నెల్లూరు, గూడూరు, బీవీపాళెం కార్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. -
పట్టుబడిన జాక్‌పాట్ లారీ
బీవీపాళెం (తడ) : అధికారుల కళ్లుగప్పి సరుకు తరలించేందుకు యత్నించిన జాక్‌పాట్ లారీని శనివారం బీవీపాళెం చెక్‌పోస్టులో పట్టుకున్నారు. చెన్నై నుంచి సూళ్లూరుపేటకు సరైన బిల్లులు లేకుండా వెళ్తున్న పార్శిల్ లారీ చెక్‌పోస్టు సమీపంలోకి వచ్చింది. లారీకి ముందు వస్తున్న పైలెట్ చెక్‌పోస్టులో అధికారుల కదలికలను గమనిస్తూ అనువైన సమయం కోసం వేచి చూస్తున్నారు. పైలెట్ ఇచ్చిన సూచనతో లారీ చెక్‌పోస్టు సమీపంలోకి వచ్చింది. ఇంతలో చెక్‌పోస్టు ఏఓ రవికుమార్ కారు సూళ్లూరుపేట నుంచి రావడం గమనించిన పైలెట్ లారీ డ్రైవర్ని వెనక్కి వెళ్లమని చెప్పడంతో డ్రైవర్ లారీని చెన్నై వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు. గమినించిన ఏఓ లారీ వద్దకు వెళ్లి రికార్డులు పరిశీలించి లారీని చెక్‌పోస్టుకు తీసుకు వచ్చి నోటీసులు జారీ చేశారు. -
డేటా ఎంట్రీ ఆపరేటర్ సస్పెన్షన్
బీవీపాళెం(తడ): బీవీపాళెం చెక్‌పోస్టు వాణిజ్య పన్నుల శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రవిబాబుని శనివారం డీసీ సస్పెండ్ చేశారు. ఈనెల 13వ తేదీన బయటి రాష్టం నుంచి మూడు లారీలు తమిళనాడు వైపు పప్పు దినుసుల లోడుతో వెళుతున్నాయని ఆ లారీలు చెక్‌పోస్టుకు వస్తే ఆపాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ నిర్లక్ష్యం వహించి లారీలకు యధావిధిగా పాసులు కొట్టి పంపించడం జరిగింది. దీనిపై విచారణ సాగించిన డీసీ దీనికి సంబంధించి ఆ రోజు విధుల్లో ఉన్న అధికారిని సీసీ కెమెరా ఫుటేజీలు, ఇచ్చిన పాసులో ఉన్న వివరాల ఆధారంగా బాధ్యుడిని గుర్తించి శనివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాలు ఎగ్జిట్ చెక్‌పోస్టులో ఎంటర్ కావాల్సి ఉండగా అవి ఇన్కమింగ్ చెక్‌పోస్టులో ఎగ్జిట్ అవడం విశేషం. -
చెక్‌పోస్టు వద్ద లారీ అపహరణ
చెక్‌పోస్టు వద్ద లారీ అపహరణ బీవీపాళెం(తడ): ఒడిశా నుంచి చెన్నైకు ఐరన్ లోడుతో వెళ్లిన లారీ తిరిగి వెళ్లే క్రమంలో బీవీపాళెం చెక్‌పోస్టు వద్ద ఆగిన సమయంలో అపహరణకు గురైంది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. డ్రైవర్ రామ్మూర్తి, క్లీనర్ వెంకయ్య సమాచారం మేరకు.. ఒడిశా నుంచి లారీ(ఏపీ25 డబ్ల్యూ 5499)లో ఐరన్ రాడ్లు తీసుకుని శుక్రవారం చెన్నై వెళ్లారు. అక్కడ అన్లోడ్ చేసుకుని రాత్రి 12.10 ప్రాంతంలో బీవీపాళెం చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. నిద్ర మత్తుగా ఉండటంతో టీ తాగి, సెల్‌ఫోన్‌కు రీచార్జ్ చేసుకునేందుకు లారీని రోడ్డు పక్కన ఆపి కిందకు దిగారు. కానీ తాళాలు లారీలోనే ఉంచేయడంతో గమనించిన దుండగుడు లారీని తీసుకుని తడ వైపు వెళ్లారు. గమనించిన క్లీనర్ వెనుకనే వెంబడించగా లారీ తప్పించుకుంది. ఇంతలో పెట్రోలింగ్ తిరుగుతూ వచ్చిన తడ పోలీస్ వాహనాన్ని గుర్తించిన క్లీనర్ విషయం తెలపడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. తడకు చేరుకుని తడలో శ్రీకాళహస్తి మార్గంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా లారీ 12. 20 సమయంలో తడ సర్వీస్ రోడ్డు మీదుగా శ్రీకాళహస్తి వైపు వెళ్లినట్టు గుర్తించారు. ఎస్ఐ సురేష్‌బాబు లారీ సిబ్బందిని వెంట బెట్టుకుని వరదయ్యపాళెం, సత్యవేడు ప్రాంతాల్లో అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించగా అక్కడ లారీ ఎంటర్ కాలేదని గుర్తించారు. ఈ రెండు ప్రాంతాలకు రాకుండా లారీ పారిపోయేందుకు ఉన్న మార్గాల్లో గాలింపు చేపట్టారు. మరో మార్గంలో నాగలాపురం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందన్న అనుమానంతో ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు ఎటువంటి ఆచూకీ లభించలేదు. గతంలో చెక్‌పోస్టు పరిసరాల్లో లారీల అపహరణలు అధికంగా ఉన్నప్పటికీ కొంత కాలంగా తగ్గుముఖం పట్టాయి. కేవలం ఇన్నోవా కార్లు మాత్రమే అపహరించడం జరుగుతూ వస్తుంది. దొంగలు మళ్లీ లారీలపై దృష్టి సారించడంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు.