చెక్‌పోస్టులో స్వైపింగ్ మిషన్ సేవలు ప్రారంభం
చెక్‌పోస్టులో స్వైపింగ్ మిషన్ సేవలు ప్రారంభం
Published Fri, Nov 25 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
బీవీపాళెం(తడ): బీవీపాళెం చెక్‌పోస్టులోని రవాణాశాఖ కార్యాలయంలో స్వైపింగ్ మిషన్లను శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చారు. వాహనాల వాహనదారులు డెబిట్ కార్డు ద్వారా పన్నులు, ఇతర లావాదేవీలు జరిపేలా స్వైపింగ్ మిషన్ల సేవలను అమల్లోకి తీసుకువచ్చారు. శుక్రవారం వేకువ జామున వచ్చిన ఓ వాహన దారుడు నగదు చెల్లింపును కార్డు ద్వారా చేసేందుకు ముందుకు రాగా ఎంవీఐ చంద్రశేఖర్‌రెడ్డి స్వైపింగ్ మిషన్ ద్వారా నగదు జమ చేసుకుని రసీదును అందజేశారు. వాహనదారులకు అవగాహన కల్పించి భవిష్యత్తులోనూ నగదు రహిత లావాదేవీలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఎంవీఐ తెలిపారు.
Advertisement
Advertisement