పట్టుబడిన జాక్‌పాట్ లారీ
పట్టుబడిన జాక్‌పాట్ లారీ
Published Sun, Sep 25 2016 3:06 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
బీవీపాళెం (తడ) : అధికారుల కళ్లుగప్పి సరుకు తరలించేందుకు యత్నించిన జాక్‌పాట్ లారీని శనివారం బీవీపాళెం చెక్‌పోస్టులో పట్టుకున్నారు. చెన్నై నుంచి సూళ్లూరుపేటకు సరైన బిల్లులు లేకుండా వెళ్తున్న పార్శిల్ లారీ చెక్‌పోస్టు సమీపంలోకి వచ్చింది. లారీకి ముందు వస్తున్న పైలెట్ చెక్‌పోస్టులో అధికారుల కదలికలను గమనిస్తూ అనువైన సమయం కోసం వేచి చూస్తున్నారు.
పైలెట్ ఇచ్చిన సూచనతో లారీ చెక్‌పోస్టు సమీపంలోకి వచ్చింది. ఇంతలో చెక్‌పోస్టు ఏఓ రవికుమార్ కారు సూళ్లూరుపేట నుంచి రావడం గమనించిన పైలెట్ లారీ డ్రైవర్‌ని వెనక్కి వెళ్లమని చెప్పడంతో డ్రైవర్ లారీని చెన్నై వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు. గమినించిన ఏఓ లారీ వద్దకు వెళ్లి రికార్డులు పరిశీలించి లారీని చెక్‌పోస్టుకు తీసుకు వచ్చి నోటీసులు జారీ చేశారు.
Advertisement
Advertisement