ఘనంగా లఘ చలన చిత్రోత్సవం
ఘనంగా లఘ చలన చిత్రోత్సవం
Published Sat, Jan 28 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM
పాలకొల్లు అర్బన్ : కళలకు ప్రసిద్ధి చెందిన పాలకొల్లులో క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ క్షీరపురికి కళవచ్చిందన్నారు. లఘు చిత్రాలు వినోదాత్మకంగా, సందేశాత్మకంగా ఉంటున్నాయని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ మానవుల నడతను లఘు చలన చిత్రాలు మంచిగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సభకు అధ్యక్షత వహించగా మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామ జోగయ్య, మునిసిపల్ ప్రతిపక్షనేత యడ్ల తాతాజీ, బీజేపీ నాయకులు బుంగా సారథి, ఏఎంసీ చైర్మన్‌లు చెరుకూరి సత్యవర్మ, ఉన్నమట్ల కబర్థి, ఉత్సవ కమిటీ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేశిరాజు రాంప్రసాద్, సభ్యులు రావూరి వెంకట అప్పారావు, ఎం ఎస్ వాసు, ఖండవల్లి వాసు, గొర్ల శ్రీనివాస్, యాతం రమేస్, కేసీహెచ్ పెద్దిరాజు, జక్కంపూడి కుమార్ పాల్గొన్నారు.
విజేతల ఎంపిక
క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఉత్తమ చిత్రంగా విజయ్‌కుమార్(బెంగుళూర్) చిత్రీకరించిన ‘అద్దిల్లు’ ఎంపికై రూ.60వేలు నగదు, జ్ఙాపిక, ప్రశంసాపత్రం అందుకున్నారు. అలాగే ద్వితీయ ఉత్తమ చిత్రంగా రాజ్‌కుమార్‌స్వామి (భీమవరం) చిత్రించిన ‘యూ ఆర్ నాట్ ఎలోన్’ ఎంపికై రూ.40 వేలు నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకున్నారు. తృతీయ ఉత్తమ చిత్రంగా శంకర్‌రాజు (హైదరాబాద్) చిత్రించిన ‘రైతు’ లఘుచిత్రం ఎంపికై రూ.20వేలు నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకున్నారు. దీంతో పాటు ఉత్తమ కథ రచయితగా తోలేటి సతీష్ చిరునవ్వుల్లో లఘుచిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లేగా అద్దిల్లు, జోడి లఘుచిత్రాలు, ఉత్తమ దర్శకుడుగా విజయ్‌కుమార్ అద్దిల్లు లఘచిత్రం, బెస్ట్ ఫొటోగ్రఫీగా అద్దిల్లు, యూఆర్ నాట్ ఎలోన్, ఉత్తమ నటుడుగా ఉత్తరం.కామ్‌లో హీరో ఆదిత్య కిరణ్, ఉత్తమ నటిగా చిరునవ్వుల్లో పాప పాత్రధారి నందిని ఎంపికై ప్రోత్సాహక నగదు బహుమతులు అందుకున్నారు. జ్యూరీ సభ్యులుగా పీఎన్ ఆదిత్య, జనార్దన మహర్షి, వీర శంకర్, పద్మిని, ఎంవీ రఘు, ఎస్.రఘునాథ్ వ్యవహరించారు.
Advertisement