విశాఖపట్నం : విభజన హామీలపై బీజేపీ దొంగాట ఆడుతోందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆదివారం విశాఖపట్నం నగరంలో టీడీపీ ఆధ్వర్యంలో మినీ మహనాడు ప్రారంభమైంది.
ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరాలని ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విభజన హామీలను కేంద్రమే అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.