చాదర్‌ఘాట్‌లో చైన్ స్నాచింగ్ | chain snach at chadar ghat | Sakshi
Sakshi News home page

చాదర్‌ఘాట్‌లో చైన్ స్నాచింగ్

Published Thu, Aug 20 2015 1:56 AM | Last Updated on Fri, Oct 19 2018 7:57 PM

చాదర్‌ఘాట్‌లో చైన్ స్నాచింగ్ - Sakshi

చాదర్‌ఘాట్‌లో చైన్ స్నాచింగ్

గాయపడిన మహిళ.. తప్పిన ప్రమాదం
 హైదరాబాద్: నల్లగొండ చౌరస్తా ఫ్లై ఓవర్ మీదుగా భార్యభర్తలు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గొలుసు తెంపుకొని పరారైన ఘటన హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. సీఐ పి.సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం మలక్‌పేటలోని ‘బి’ క్వార్టర్‌కు చెందిన వర్ధనమ్మ (52), భర్త శ్రీనివాస్ మంగళవారం రాత్రి నాంపల్లిలోని ఓ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో నల్లగొండ ఫ్లై ఓవర్ మీదుగా వస్తున్నారు.

వారి వెనుకగా ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చి వర్ధనమ్మ మెడలో నుంచి మూడు తులాల పుస్తెలతాడు, 12 గ్రాముల గొలుసు తెంపుకొని పారిపోయారు. ఈక్రమంలో వాహనంపై ఉన్న వర్ధనమ్మ కిందపడిపోగా ఆమె భుజానికి, తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను భర్త శ్రీనివాస్ మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా చైన్ స్నాచింగ్ జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు ఉన్నాయని వాటి ఆధారంగా నిందితులను పట్టుకుంటామని ఈస్ట్ జోన్ డీసీపీ డా.రవీందర్ పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement