సీఎం ప్రసంగిస్తుండగా వెళ్లిపోయిన మహిళలు | chandra babu naidu speech disppoints for women | Sakshi
Sakshi News home page

సీఎం ప్రసంగిస్తుండగా వెళ్లిపోయిన మహిళలు

Published Sun, Aug 16 2015 9:05 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

సీఎం ప్రసంగిస్తుండగా వెళ్లిపోయిన మహిళలు - Sakshi

సీఎం ప్రసంగిస్తుండగా వెళ్లిపోయిన మహిళలు

ఏలూరు: పోలవరం మండలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని శనివారం సాయంత్రం జాతికి అంకితం చేసిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి గంట ఆలస్యంగావిచ్చేసినా అనుకున్న సమయానికే సభా కార్యక్రమాన్ని ముగించారు. ముఖ్యమంత్రి సభా వేదికపైకి వచ్చిన వెంటనే కాస్త ఉత్సాహంగా కనిపించి, చప్పట్లు కొట్టిన మహిళలు అంతలోనే నిరాశకు గురయ్యారు. ముఖ్యమంత్రి తమ కోసం ఏమైనా మాట్లాడతారేమో అనే ఆశతో చాలాసేపు ఎదురుచూశారు. అయితే ముఖ్యమంత్రి ప్రసంగం ఆద్యంతం మహిళలను నిరాశపరిచింది.

మంత్రులు, ఎంపీ మాట్లాడినప్పుడు ఓపిగ్గా విన్న మహిళలు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని మాత్రం వినలేకపోయారు. ఆయన ప్రసంగిస్తుండగానే మహిళలు లేచి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా సీఎం నివ్వెరపోయారు. ఆయన మహిళల సమస్యలు ప్రస్తావించకుండా ప్రసంగం కొనసాగించారు. దీంతో సభా ప్రాంగణానికి ముందు ఏర్పాటు చేసిన మహిళా గ్యాలరీ బోసిపోయి కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement