రాజమండ్రి : గోదావరిలో పుష్కర స్నానాలకు 15 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శనివారం రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో పుష్కరఘాట్ల వద్ద తాజా పరిస్థితులను చంద్రబాబు సమీక్షించారు.
18 ప్రధాన పుష్కరఘాట్లతో 171 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, విశాఖపట్నం జల్లాలలో రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 18 పుష్కరఘాట్లకు 10 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులతో పర్యవేక్షణ చేయిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ అన్ని పుష్కర ఘాట్లలో 12 లక్షల 30వేలమంది పుణ్యస్నానాలు చేశారని చంద్రబాబు తెలిపారు.
18 పుష్కర ఘాట్లకు 10 మంది ట్రైనీ ఐఏఎస్లు
Published Sat, Jul 18 2015 1:30 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement