ధరలు ఎందుకు పెరుగుతున్నాయి: సోము వీర్రాజు | Chandrababu naidu should order to vigilence on rates hike | Sakshi
Sakshi News home page

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి: సోము వీర్రాజు

Published Tue, Feb 23 2016 11:14 AM | Last Updated on Mon, Oct 22 2018 8:57 PM

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి: సోము వీర్రాజు - Sakshi

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి: సోము వీర్రాజు

హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధరల పెరుగుదల ఆందోళనగా ఉందని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు చెప్పారు. రైతుకి గిట్టుబాటు ధర లేదు కానీ.. మార్కెట్లో పప్పుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయని మండిపడ్డారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధరల పెరుగుదలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజిలెన్స్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మార్చి 6 తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉద్యమం చేస్తామన్నారు. గుంటూరులో అగ్రిగోల్డ్కు అనేక భూములు ఉన్నాయని ఆరోపించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో సామాన్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పారు. మార్చి 6న బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతారని సోమువీర్రాజు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement