
20 బ్లాక్ చానల్‌కు గండి
–నీట మునిగిన పంటలు
రుద్రవరం : మండల కేంద్రం సమీపంలోని తెలుగుగంగ 20 బ్లాక్ చానల్ కట్ట మంగళవారం తెల్లవారుజామున కోతకు గురై గండిపడింది. కాల్వ నీటికి తోడు వర్షంతో నిండిన రంగారెడ్డి చెరువు అలుగు నీరు తోడు కావడంతో గ్రామ సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. 20 ఎకరాలకు పైగా వరినాట్లు నీటిలో మునిగి పోయాయి. ఎకరానికి రూ.10 వేలు పెట్టబడి పెట్టామని, మరో రెండు రోజులు నీరు నిల్వ ఉంటే నాట్లు కుల్లిపోతాయని రైతులు ప్రహ్లాదుడు, నరసింహ, ఉస్సేనీ, జాకీర్‌లతోపాటు పలువురు వాపోయారు.