కుట్టు మెషిన్లు ఇప్పిస్తానంటూ బురిడీ
Published Sat, Mar 11 2017 1:39 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM
దేవరపల్లి (ద్వారకాతిరుమల) : గ్లోబల్ గివింగ్ సంస్థ పేరుతో మహిళలకు కుట్టుమెషిన్లు ఇస్తామని రూ.లక్షల పైబడి సొమ్ములు వసూలు చేసి బురిడీ కొట్టించారు. దీనిపై బాధిత మహిళలు శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. బాధిత మహిళలు తెలిపిన వివరాలిలా.. కృష్టాజిల్లాకు చెందిన చేకూరి ధన శిరీష కొద్దిరోజుల క్రితం ద్వారకాతిరుమల వచ్చి రూ.మూడు వేలిస్తే కొత్త కుట్టు మెషిన్లు ఇస్తామని, అలాగే 6 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని నమ్మ బలికింది. గ్రామంలో 54 మంది మహిళల నుంచి ఒక్కక్కరి నుంచి రూ.2 వేల చొప్పున మొత్తం రూ.1.08 లక్షలు వసూలు చేసింది. గ్లోబల్ గివింగ్ సంస్థ పేరుతో మహిళలకు రశీదు ఇచ్చింది. అయితే ఇంతవరకూ కుట్టు మెషిన్లు రాలేదని బాధిత మహిళలు వాపోయారు. తామంతా కూలి పనులు చేసుకుని జీవించేవారమని, తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement