స్టేషన్‌ఘన్‌పూర్ (వరంగల్) : స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుండటంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లిన లేగదూడను చిరుతపులి వేటాడి చంపింది. దీంతో గ్రామస్థులు చిరుతను బంధించాలని అటవీ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.