
నిమజ్జనంలో అపశృతి... బాలికమృతి
సిద్దవటం: సిద్దవటంలోని పెన్నానదిలో బుధవారం రాత్రి వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. చంద్రిక(6) అనే బాలిక పెన్నా నీటిలో మునిగిపోయి మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. కడపలోని కొండాయపల్లెలో ఏర్పాటు చేసిన వినాయకుడిని బుధవారం సాయంత్రం నిమజ్జనం చేసేందుకు పెన్నానదికి వెళ్లారు. గ్రామానికి చెందిన ఆకుల కిశోర్‌బాబు, చంద్రకళ అనే దంపతులు తమ పిల్లలు చంద్రిక, గీతా అన్వితా లను వెంట తీసుకెళ్లారు. విగ్రహాన్ని పెన్నాలో నిమజ్జనం చేసిన తరువాత గ్రామస్తులందరూ పెన్నానీటిలో స్నానానికి వెళ్లారు. కిశోర్‌బాబు దంపతులు కూడా తమ ఇద్దరి పిల్లలను నది ఒడ్డున ఉంచి స్నానానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి పెద్దకుమార్తె చంద్రిక కనిపించలేదు. దీంతో నది పరిసర ప్రాంతాలలో, సిద్దవటం గ్రామంలో గాలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా గాలించారు. ఎక్కడా కనిపించలేదు. గురువారం ఉదయం పెన్నానది కొత్తబ్రిడ్జికి తూర్పువైపు బాలిక చనిపోయి ఉందని ఎస్‌ఐ లింగప్పకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆయన తమ సిబ్బందితో వెళ్లి మృత దేహాన్ని పరిశీలించి తల్లిదండ్రలకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతిచెందిన చంద్రికను చూసి కుటుంబీకులు, బంధువులు బోరున విలపించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించి కేసు నమోదుద చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు అన్నారు.