సమావేశంలో మాట్లాడుతున్న ముఖేష్‌కుమార్ సిన్హా
మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ ముఖేష్‌కుమార్ సిన్హా
విజయనగరం పూల్‌బాగ్: బాలలను పనుల్లో పెడితే క్రిమినల్ చట్టాల ప్రకారం శిక్షార్హులు అవుతారని, కాబట్టి గనుల్లో వారిని చేర్చుకోవద్దని మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ ముఖేష్ కుమార్S సిన్హా (హైదరాబాద్) అన్నారు. పట్టణంలోని ఎస్‌విఎన్ లేక్‌ప్యాలెస్‌లో జిల్లాలోని మైన్స్ ఓనర్స్‌తో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలి కాలంలో జార్ఖండ్‌లో మైన్స్ ప్రమాదంలో ఏడుగురు మైనర్లు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా పరిగణనిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌కె.సర్వాగీ కంపెనీ సీఈఓ అశోక్ కుండా, ఆర్‌బీఎస్సెస్‌డీ మేనేజర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.