బాల్యంపై భారం
ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన చిన్నారులు తమ వయసుకు మించిన భారం మోస్తున్నారు. ఈ-క్లాస్‌లు అంటూనే కేజీ చదివే పిల్లల భుజాలకు ఐదు కేజీలకు పైగా బరువున్న పుస్తకాల బ్యాగులు తగిలిస్తున్నారు. వీటిని ఇంటి నుంచి బస్సు, ఆటో వరకు పుస్తకాలను మోయడమే కష్టం. ఇటువంటిది నాలుగైదు అంతస్తులు ఉన్న పాఠశాలల్లో మెట్లు ఎక్కేందుకు చిన్నారులు అల్లాడిపోతున్నారు. ఈ ప్రభావం పిల్లల ఎదుగుదలపై చూపుతోంది. చిన్న వయసులోనే నడుం నొప్పుల బారినపడుతున్నారు. ఒత్తిడి లేని విద్య కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది.
- ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం