
ఫాంహౌస్ నుంచి హైదరాబాద్‌కు సీఎం
జగదేవ్‌పూర్: నాలుగు రోజులుగా మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో ఉన్న సీఎం కేసీఆర్ మంగళవారం హైదరాబాద్ వెళ్లారు. వ్యవసాయక్షేత్రంలో ఖరీఫ్ పనులను పరిశీలించారు. ఏ పంటలు సాగు చేయాలో ఫాం హౌస్ బాధ్యులకు సలహాలు, సూచనలిచ్చారు. మంగళవారం సాయంత్రం కేసీఆర్ మర్కుక్, పాములపర్తి, గౌరా రం మీదుగా రోడ్డు మార్గాన కాన్వాయ్ ద్వారా హైదరాబాద్‌కు వెళ్లారు. వారంలో మళ్లీ ఫాంహౌస్‌కు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.