మరో ఐదు రోజులు వర్షాలు అంతంతే.. | comeing five days rainfalow drizzle | Sakshi
Sakshi News home page

మరో ఐదు రోజులు వర్షాలు అంతంతే..

Published Tue, Aug 16 2016 6:29 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

comeing five days rainfalow drizzle

జగిత్యాల అగ్రికల్చర్‌: రానున్న ఐదు రోజులపాటు వర్షాలు అంతంతమాత్రంగానే కురియనున్నట్లు పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్‌ లక్ష్మణ్‌ తెలిపారు. ఆగస్టు 17 నుంచి 21వరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమైనా చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ చిరుజల్లులు సైతం ఆగస్టు 19న 5 మి.మీ, 20న 8 మి.మీ, 21న 6 మి.మీ వర్షం మాత్రమే కురిసే అవకాశం ఉందని వివరించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 31–38 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రతలు 24–25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం ఉదయం 64–69 శాతం, మధ్యాహ్నం 64–76 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి దిశ నుంచి గంటకు 9–15 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement