ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి | Complaints to be solved urgently | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

Published Tue, Mar 7 2017 10:53 PM | Last Updated on Fri, Jul 26 2019 5:59 PM

ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి - Sakshi

ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

పోలీస్‌స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ ఎం.శ్రీనివాస్‌ సూచించారు.

► ఎస్పీ ఎం.శ్రీనివాస్‌
►  ప్రజాఫిర్యాదుల విభాగంలో అర్జీల స్వీకరణ


ఆదిలాబాద్‌ : పోలీస్‌స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ ఎం.శ్రీనివాస్‌ సూచించారు. సోమవారం స్థానిక పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎనిమిది మంది ఎస్పీకి అర్జీలు అందజేశారు. అనంతరం ఎస్పీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లా పోలీసులు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ముందంజలో ఉండాలన్నారు.

గ్రామాలను సందర్శించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలన్నారు. వేసవి రావడంతో రాత్రి సమయంలో గస్తీ నిర్వహించే పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎలాంటి ఆర్థిక నేరాలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. అదనపు ఎస్పీ పనసారెడ్డి, ఫిర్యాదుల విభాగం అధికారులు శివాజీ చౌహాన్, జైస్వాల్‌ కవిత, స్పెషల్‌ బ్రాంచి ఇన్ స్పెక్టర్‌ బి.ప్రవీణ్, ఎస్సైలు అన్వర్‌ఉల్‌హక్, జి.రామన్న, ఎంఏ హకీం, సీసీ పోతరాజు, కార్యాలయ అధికారులు పుష్పరాజ్, జె.భారతి ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement