
నిర్దేశిత లక్ష్యాన్నిపూర్తి చేయాలి
♦ భూ పరిపాలన కమిషనర్ రేమండ్ పీటర్
♦ హరితహారం, సాదాైబైనామాలపై సమీక్ష
♦ మొక్కల సంరక్షణ అవసరం: కలెక్టర్
వికారాబాద్ : హరితహారం కింద మొక్కలు నాటడంలో నిర్ధేశించిన లక్ష్యాలను వందకు వంద శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమీషనర్ (సీసీఎల్‌ఏ) రేమండ్‌పీటర్ అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రవీంద్ర మండపంలో హరితహారం, సాదాదైనామాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కింద మొక్కలు నాటేందుకు గాను సరిపడా మొక్కలు అందుబాటులో ఉన్నాయని ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలన్నారు. సాదాదైనామాలపై సమీక్షిస్తూ ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దార్లు, వీఆర్‌ఓలు దృష్టి సారించాలన్నారు.
అసైన్ ్డ భూముల పరిశీలన ప్రక్రిను పూర్తి చేయాలని తహసీల్దార్లకు సూచించారు. కలెక్టర్ రఘునందన్ రావు మాట్లాడుతూ.. హరితహారం కింద నిర్ధేశించిన కార్యాచరణ ప్రణాళికల మేరకు మొక్కలు నాటే లక్ష్యాలను సాధించాలని సూచించారు. వచ్చే పది రోజుల్లో మొక్కలు నాటే ప్రక్రియతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజూ గ్రామాల్లో మొక్కలు నాటిన అనంతరం సాయంత్రం నలుగురు సెక్టోరల్ అధికారులైన తహసీల్దారు, ఎంపీడీఓ, ఎంఈఓచ మండల వ్యవసాయాధికారి ఆ రోజు జరిగిన వివరాలు పంపడంతో పాటు సమస్యలేవైనా ఉంటే సమీక్షించుకోవాలని సూచించారు.
ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలు, పార్కుల్లో ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టి మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్‌కు సూచించారు. ఈ సందరర్భంగా హరిత హరం కార్యక్రమం పురోగతిపై మండలాల వారిగా సమీక్షించారు. కార్యక్రమంలో జారుుంట్ కలెక్టర్ ఆమ్రపాలి, సబ్‌కలెక్టర్ శ్రుతిఓజా, అసిస్టింట్ కలెక్టర్ ప్రమేల సత్పతి, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, డీఎఫ్‌ఓ శ్రీనివాస్, డ్వామా పీడీ హరిత, వికారాబాద్ డివిజన్ కు సంబంధించిన తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఏపీఓ, అటవీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.