Published
Sun, Jul 17 2016 9:44 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
టీఆర్‌ఎస్‌తోనే నియోజకవర్గ అభివృద్ధి: ఎమ్మెల్యే
గూడపూర్(మునుగోడు): గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అన్ని రంగాల్లో వెనకబాటుకు గురైనlమునుగోడు నియోజకవర్గం టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గూడపూర్ గ్రామంలో టీడీపీ, సీపీఎంతో పాటు పలువురు మాజీ సర్పంచ్‌లు టీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి సాగు నీటి వనరులు లేని ఈ ప్రాంతానికి డిండి ప్రాజెక్టు ద్వారా నీరు అందించేందుకు త్వరలో రూ. 5 వేల కోట్లతో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. ఆ పనులు పూరైయితే ఈ ప్రాంతంలోని 2 లక్షల బీడు భూములకు సాగునీరు అందుతుందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనా నాటి నుంచిlనేటి వరకు నియోజకవర్గానికి రూ.300 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు.గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌లు నన్నూరి భూపతిరెడ్డి, సింగపంగ మల్లయ్య, పాల సొసైటీ చైర్మన్ నక్క భిక్షం, దర్శనం వెంకన్న, నన్నూరి సీతారాంరెడ్డి, బుచ్చిరెడ్డిలతో పాటు నలుగురు వార్డు మెంబర్లు, మరో 200 మంది యువకులు ఆ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ సిరగమళ్ల నర్సింహ, ఆ పార్టీ జిల్లా నాయకులు లాల్‌బహదూర్‌గౌడ్, గుర్రం సత్యం, దాడి శ్రీనివాస్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బోడ్డు నర్సింహగౌడ్, ఎంపీటీసీ సుంకరబోయిన రాణి, రాము, సర్పంచ్‌లు ఆకుల వెంకన్న, ఐతగొని బుచ్చయ్య, కంభంపాటి వెంకటయ్య పాల్గొన్నారు.