ముగిసిన కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు
ముగిసిన కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు
Published Sat, Dec 3 2016 9:37 PM | Last Updated on Mon, Aug 20 2018 3:37 PM
– 14,576 మంది రాత పరీక్షకు ఎంపిక
కర్నూలు: కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు శనివారం ముగిసాయి. గత నెల 7వ తేదీ నుంచి స్థానిక ఏపీఎస్పీ మైదానంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో ఆరు జిల్లాల అభ్యర్థులు ఈ స్క్రీన్ టెస్టుకు హాజరయ్యారు. మొత్తం 16,363 మంది హాజరు కాగా, ఇందులో 14,576 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. చివరిరోజు శనివారం ఎక్కువమంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. మహిళా, పురుష అభ్యర్థులు కలిపి 1,025 మంది హాజరు కాగా, అందులో 856 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. నెల రోజుల పాటు దేహదారుఢ్య పరీక్షల వద్ద సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, లైజనింగ్ ఆఫీసర్ షరీఫ్, పరిపాలన అధికారి అబ్దుల్ సలాం, సీఐ మధుసూదన్‌రావు, మినిస్టీరియల్ సిబ్బంది, ఈకాప్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement