![Constable physical fitness tests in December](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/11/2/11.jpg.webp?itok=T5SK2qeG)
సాక్షి, అమరావతి: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు డిసెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర పోలీసు నియామక మండలి (ఎస్‌ఎల్‌పీఆర్‌బీ) తెలిపింది. 2023, జనవరి 21న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4.59 లక్షల మంది హాజరుకాగా వారిలో 95,208 మంది అర్హత సాధించారు. న్యాయపరమైన అంశాలతో దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ వివాదాలు పరిష్కారం కావడంతో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని ఎస్‌ఎల్‌పీఆర్‌బీ నిర్ణయించింది.
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిలో 92,507 మంది దేహదారుఢ్య పరీక్షల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారని, మిగిలిన వారూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తులు నవంబర్ 11–21 వరకు slprb.ap.gov.in లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పూర్తి వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్లు 9441450639, 9100203323ను సంప్రదించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment