నంద్యాలను అభివృద్ధి చేయలేకపోయాం
నంద్యాలను అభివృద్ధి చేయలేకపోయాం
Published Wed, Jun 28 2017 11:18 PM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM
టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మూడేళ్ల తెలుగుదేశం పాలనలో నంద్యాలను అభివృద్ధి చేయలేకపోయామని ఆ పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఐడీసీ చైర్మన్ కేఈ ప్రభాకర్ అన్నారు. బుధవారం..పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి కావాలంటే నంద్యాల ప్రజలు ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలన్నారు. నాలుగేళ్ల వరకు మునిసిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిబంధనలు ఒప్పుకోవన్నారు. అయితే కౌన్సిలర్లకు ఎందుకు నోటీసులు ఇచ్చారని ప్రశ్నిస్తే..నీళ్లు నమిలారు. జూలై 6, 7 తేదీల్లో మంత్రి లోకేష్ జిల్లాకు రానున్నారని చెప్పారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement