రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హరినాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
అనంతపురం అర్బన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హరినాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్వచ్ఛందంగా మంగళవారం జరిగిన బంద్‌ని కక్షగట్టి మరీ విఫలం చేసేందుకు యత్నించడం ద్వారా చంద్రబాబు తన నైజం, ఉద్దేశం బయటపడిందన్నారు. బుధవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి డి.జగదీశ్, సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
స్వప్రయోజనాల కోసం ప్రధాని మోదీ ముందు మోకరిల్లి రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఉంచలేదని ఒకసారి, ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని మరోసారి వెంకయ్య నాయుడు చెబుతున్నారని విమర్శించారు.