'మాల్యాను ఆ రెండు పార్టీలు పెంచి పోషించాయి' | cpi narayana slams modi government over mallya escape | Sakshi
Sakshi News home page

'మాల్యాను ఆ రెండు పార్టీలు పెంచి పోషించాయి'

Published Sat, Mar 12 2016 4:40 PM | Last Updated on Sat, Apr 6 2019 9:07 PM

cpi narayana slams modi government over mallya escape

నెల్లూరు : బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగవేసిన విజయ్ మాల్యా లాంటి వ్యక్తి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ప్రమేయం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. అందుకే 9వేల కోట్ల రూపాయలకు అప్పులు చేసి ఉద్దేశ్య పూర్వకంగా ఎగ్గొట్టినట్లు ఆధారాలున్నప్పటికీ, వాటిని తొలగించడం వల్లే  మాల్యా విదేశాలకు పారిపోగలిగారని ఆయన అన్నారు.

 

నెల్లూరులో జరిగిన సీపీఐ కార్యవర్గ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. విజయ్ మాల్యాకు సహకరించడం వల్లే మాగుంట సుబ్బిరామిరెడ్డి బలయ్యారని నారాయణ అన్నారు. విజయమాల్యాను కాంగ్రెస్, బీజేపీలు పెంచి పోషించాయని, మాల్యా పారిపోవడానికి మోదీ ప్రభుత్వమే కారణమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement