తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై సీపీఐ నేత కె.నారాయణ నిప్పులు చెరిగారు. ఇద్దరు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట మార్చారని ఆయన ఆరోపించారు. శనివారం తిరుపతిలో ప్రత్యేక హోదా కోసం ఏర్పాటు చేసిన ప్రజా బ్యాలెట్లో నారాయణ పాల్గొన్నారు.
రాష్ట్రం నుంచి అనేక ప్రాజెక్టులు తరలిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమం జరుగుతుందన్నారు. ఈ ఉద్యమంలో చంద్రబాబు, వెంకయ్య కొట్టుకుపోతారని నారాయణ చెప్పారు.