ఒకే దఫాలో రుణమాఫీ చేయాలి
–వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం
–బాధిత రైతులను వెంటనే ఆదుకోవాలి
–వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
–దామరచర్లలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటన
మిర్యాలగూడ : రైతుల పంట రుణాలను విడుతల వారీగా కాకుండా ఒకే దఫాలో మాఫీ చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర అద్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్లలో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని, పెట్టుబడులకు అయిన ఖర్చులను ప్రభుత్వం నష్ట పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పత్తి చేలలో నీరు నిలిచి పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని, వీటితో పాటు పెసర, కంది పంటలకు కూడా వందలాది ఎకరాల్లో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని అనేక గ్రామాల్లో రోడ్లు, కల్వర్టులు తెగి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు. ఆయన వెంట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి బాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు ఎండీ సలీం, వేముల శేఖర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మేష్యానాయక్, దామరచర్ల, మిర్యాలగూడ పట్టణ, మండలం, వేములపల్లి మండల పార్టీల అధ్యక్షులు అన్నెం కరుణాకర్‌రెడ్డి, ఎంవీఆర్‌రెడ్డి, పిలుట్ల బ్రహ్మం, పెదపంగ సైదులు, హుజూర్‌నగర్ మండలం, పట్టణ అధ్యక్షుడు జడ రామకృష్ణ, గుర్రం వెంకట్‌రెడ్డి, నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షులు కుందూరు మట్టారెడ్డి, జిల్లా కార్యదర్శి ఇనుపాల పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.