
దసరా సందడి
దసరా పండుగ దగ్గర పడుతోంది. నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ నిత్యావసర సరుకుల కొనుగోళ్లలో ప్రజలు నిమగ్నమయ్యారు. అనంతపురం నగరంలోని ప్రధాన వీధులు, కూడళ్లలోని బంగారు, వస్త్ర దుకాణాలు, కిరాణా షాపులు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి.
ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు దుకాణాదారులు పోటీపడుతున్నారు. ఫుట్‌పాత్ వ్యాపారులు కూడా భారీ తగ్గింపు ధరలతో వస్త్రాలు విక్రయిస్తుండటంతో పేదలు ఎగబడ్డారు. కొనుగోళ్ల నేపథ్యంలో ఏటీఎం సెంటర్ల వద్ద కూడా డబ్బు డ్రా చేయడానికి వినియోగదారులు క్యూ కట్టడం కనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం