సాక్షి, హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాజీనామా చేయాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. వీసీ అప్పారావును వెంటనే సస్పెండ్ చేసి, ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పేర్కొన్నారు. మంగళవారం మఖ్దూంభవన్‌లో పార్టీనాయకులు అజీజ్ పాషా, సిద్ధి వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు, పశ్యపద్మతో కలసి మాట్లాడుతూ.. కులతత్వం, తీవ్రవాద, జాతి వ్యతిరేక రాజకీయాలకు హెచ్‌సీయూ నెలవుగా మారిందని వ్యాఖ్యానించారు. రోహిత్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.