బిజినెస్ కరస్పాండెంట్లుగా డీలర్లు
బిజినెస్ కరస్పాండెంట్లుగా డీలర్లు
Published Fri, Nov 18 2016 12:03 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
– ఈ– పాస్ మిషన్‌ల ద్వారా డిబెట్ కార్డులతో నగదు బదిలీ
– కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): చౌక ధరల దుకాణాల డీలర్లందరు వారం రోజుల్లో బ్యాంకుల బిజినెస్ కరస్పాండెంట్లుగా రిజిస్టర్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. ప్రతి రోజు ఎంత మంది డీలర్లు రిజిష్టర్ చేసుకున్నారనే వివరాలు ఎప్పటికప్పుడు ఇవ్వాలని డీఎస్‌ఓ తిప్పేనాయక్ కు సూచించారు. గురువారం కాన్ఫరెన్స్ హాల్‌లో డీలర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రజా పంపిణీలో ఎలక్ట్రానిక్ లావాదేవీలను చేపట్టాలని నిర్ణయించిందన్నారు. బిజినెస్ కరస్పాండెంట్లుగా మారుతున్న డీలర్లు గ్రామ స్థాయిలో బ్యాంకు చేసే అన్ని కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందన్నారు. అందుకు కమీషన్ అందజేయనున్నట్లు చెప్పారు. ప్రతి డీలరుకు బ్యాంకులు ఈ–పాస్ మిషన్‌లు ఇస్తుందని దీని ద్వారానే ఎలక్ట్రానిక్ లావాదేవీలు నిర్వహించాలన్నారు. డెబిట్, రూపే కార్డుల ద్వారా కార్డుదారుల ఖాతాల నుంచి సరుకులకు అయ్యే మొత్తాన్ని తమ ఖాతాలకు బదిలీ చేసుకోవాలన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే సరుకులే గాక ఇతర సరకులు అమ్మకోవచ్చన్నారు. జిల్లాలో అనేక మందికి జన్«ధన్ ఖాతాలు ఉన్నాయని, వీటిని యాక్టివేట్‌లోకి తెస్తున్నామన్నారు. çహోటళ్లు, బస్సుల్లోను ఈ –పాస్ మిషన్ ద్వారా నగదు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామనన్నారు. సమావేశంలో కర్నూలు అర్బన్ ఏఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి, సీఎస్‌డీటీలు పాల్గొన్నారు.
Advertisement