
గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి
లేపాక్షి : మండలంలోని చోళసముద్రం సమీపంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి చెందింది. గురువారం ఉదయమే అటుగా వెళ్తున్న వారు గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. హిందూపురం సెక‌్షన్ రేంజ్ ఆఫీసర్ మదన్‌మోహన్ వెంటనే అక్కడికి చేరుకుని జింక కళేబరాన్ని లేపాక్షి పశువైద్య కేంద్రానికి తీసుకువచ్చారు. పశువైద్యాధికారిణి డాక్టర్ హేమలత ఆధ్వర్యంలో జింక కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు.