నిరసనల హోరు
నిరసనల హోరు
Published Fri, Apr 7 2017 11:56 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
- వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ‘సేవ్ డెమోక్రసీ’ నిరసనలు
- హోరెత్తిన బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు, ఆందోళనలు
- మద్దతు పలికిన ప్రజలు, ప్రజాసంఘాలు
- ప్రజాకోర్టులో చంద్రబాబును దోషిగా నిలబెడతామని హెచ్చరిక
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఫిరాయింపు ఎమ్మెల్యేకు మంత్రి పదువులు ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, ప్రజాస్వామాన్ని కాపాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు..శుక్రవారం కదంతొక్కాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో నిరసన తెలిపారు. బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో కదంతొక్కారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలు, ముఖ్య నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడంతో సేవ్ డెమోక్రసీ ఆందోళనలు విజయవంతమయ్యాయి. నిరసనలకు ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
కర్నూలు: స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంపీ బుట్టా రేణుక, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ హఫీజ్‌ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే కొత్తకొట ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి పాతబస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేడ్క ర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. నాయకులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, సీహెచ్ మద్దయ్య పాల్గొన్నారు.
పాణ్యం: కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనైకిత రాజకీయాలను గౌరు దంపతులు ఎండగట్టే సమయంలో ప్రజల నుంచి భారీ స్పందన కనిపించింది. నాయకులు కర్నాటి పుల్లారెడ్డి, దేశం సత్య నారాయణరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
డోన్: వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు ఆధ్వర్యంలో డోన్‌లో నిర్వహించిన సేవ్ డెమోక్రసీ నిరసనకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. పార్టీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో సుమారు 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు రామచంద్రుడు, కోసిగి హరి, రజావర్దన్, దినేష్‌గౌడ్, రఫీ, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.
పత్తికొండ: పార్టీ పత్తికొండ నియోజవర్గ ఇన్‌చార్జీ చెరుకులపాడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వెల్దుర్తి మండల కేంద్రంలో ‘సేవ్ డెమోక్రసీ’ నిరసన పెద్ద ఎత్తున జరిగింది. రామళ్లకోట రోడ్డు నుంచి తహశీల్దార్ కార్యాలయంలో వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు బజారప్ప, వెంకటరాముడు, శ్రీరంగడు, జగన్నాథరెడ్డి పాల్గొన్నారు.
కోడుమూరు: సేవ్ డెమోక్రసీ నిరసనల్లో వందలాది మంది వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నాయకులు కృష్ణారెడ్డి, లింగారెడ్డి, సుధాకరరెడ్డి, జూలకల్‌భాస్కరరెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు: పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నాయకులు కేఆర్ రాఘవరెడ్డి, కాశీవిశ్వనాథ్‌రెడ్డి, బుట్టా రంగయ్య, గోవిందురెడ్డి పాల్గొన్నారు.
నందికొట్కూరు: ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, తవుడయ్య, లోకేష్‌రెడ్డి, వంగల భతర్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
శ్రీశైలం: ఆత్మకూరులో పార్టీ ఇన్‌చార్జ్ బుడ్డాశేషారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి గౌడ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ రాస్తారోకో చేశారు. విజయభాస్కరరెడ్డి, ఈశ్వరరెడ్డి, శరభారెడ్డి పాల్గొన్నారు.
బనగానిపల్లె: నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. కాటసాని ఇంటి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో సుమారు 600 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు చిన్నబాబు, నాయకులు శివరామిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కర్రా హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: గంగుల బీజేంద్రనాథ్‌రెడ్డి(నాని) ఆధ్వర్యంలో ఆళ్లగడ్డలో వెయ్యి మందికార్యకర్తలతో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నాయకులు రాఘవరెడ్డి, బాబులాల్, సలాం, నారాయణ పాల్గొన్నారు.
నంద్యాల: నంద్యాలలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మాధవరెడ్డి, ఖాద్రీ ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ నిరసనలు జరిగాయి. పార్టీ ఆఫీసు నుంచి భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయంలో వరకు వెళ్లి అక్కడ ఆందోళన చేపట్టారు.
ఆలూరు: వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ ఈరన్న ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ఆదోని: పాతబస్టాండ్‌లో సేవ్ డెమోక్రసీ నిరసన హోరెత్తింది. ముందుగా పార్టీ నాయకులు గోపాల్, మధుసూదన్, ప్రసాదరావు, దేవ, మహేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడి నిరసన వ్యక్తం చేశారు.
మంత్రాలయం: రాఘవేంద్ర సర్కిల్‌లో నిర్వహించిన సేవ్ డెమోక్రసీ నిరసనలో రాష్ట్ర యూత్ నాయకులు ప్రదీప్‌రెడ్డి, నాయకులు బీమ్‌రెడ్డి, బీమన్న పాల్గొన్నారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం నిరసన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement