- జీఎం కార్యాలయం ఎదుట డిపెండెంట్ల ధర్నా
వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి
Published Sat, Aug 20 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
కోల్‌బెల్ట్(వరంగల్) : సింగరేణిలో సర్వీసు నిబంధనలు లేకుండా వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణియన్ సన్స్ అసోసియేషన్(ఎస్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించా రు. అనంతరం సింగరేణి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం, సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయారని ఆరోపించారు. సింగరేణిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, నూతన గనులు ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేసిన కేసీఆర్ కార్మికులను మోసం చేస్తున్నారని అన్నారు. వారసత్వ ఉద్యోగాల సాధనకు చేపట్టే ఉద్యమంలో తమ పార్టీ పాలుపంచుకుంటుందని ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ నాయకులు మెండే కృష్ణకుమార్, సిద్ధిక్ షేక్, కిషోర్‌కుమార్, రాజ్‌కుమార్, వినోద్, రామారావు, శివ, ప్రకాశ్, నరేష్, శ్రీధర్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement