బాలల హక్కులపై అవగాహన పెంచుకోవాలి
బాలల హక్కులపై అవగాహన పెంచుకోవాలి
Published Sat, Dec 17 2016 9:22 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
– జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): బాలల హక్కులు, వారికున్న చట్టాలపై (జువైనల్) పోలీసులు, న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి పేర్కొన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోలీసులు, బాలల సంరక్ష అధికారులు, జువైనల్ యూనిట్ల అధికారులకు జువైనల్ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు ఎంఏ సోమశేఖర్, జిల్లా ఎస్పీ ఆర్‌కే రవికృష్ణ, జేసీ–2 రామస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న పెను మార్పులతో బాలల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి బాలలను చిన్నతనంలోనే గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో బాలలు తమ హక్కులను కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో నాలుగో అదనపు జిల్లా జడ్జి రఘురామ్, ఆరో అదనపు జిల్లా జడ్జి వీ.శేషుబాబు, సీనియర్ సివిల్ జడ్జీలు, జూనియర్ సివిల్ జడ్జీలు, ప్రభుత్వ న్యాయవాదులు, జైలు అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement