ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిర్ణయించినట్టు యూటీఎఫ్ నాయకులు బి.జయకర్, పీఆర్‌టీయూ నాయకులు కేవీవీ సుబ్బారావు, ఏపీపీటీ వి.ధర్మారావు, బీటీఏ అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, ఏపీయూఎస్ అధ్యక్షుడు కేఎస్‌వీకే రాజ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు డీఈవో డి.మధుసూదనరావుకు ఇప్పటికే నోటీసులు అందించామన్నారు. బేస్‌మెంట్ పరీక్షలు రద్దు చేయాలని, స్కూల్ క్యాలెండర్ ప్రకారం మాత్రమే పాఠశాల సమయాలు, పరీక్షలు నిర్వహించాలని, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ చేసే పనులు అప్పగించరాదని, బడి గంటలు కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని నోటీస్‌లో పేర్కొన్నామని చెప్పారు