విజయకీలాద్రిపై ధ్వజస్తంభ ప్రతిష్ఠ | Dhwajasthmba Prathista at Vijayakeeladri | Sakshi
Sakshi News home page

విజయకీలాద్రిపై ధ్వజస్తంభ ప్రతిష్ఠ

Published Mon, Feb 6 2017 10:10 PM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

విజయకీలాద్రిపై ధ్వజస్తంభ ప్రతిష్ఠ

విజయకీలాద్రిపై ధ్వజస్తంభ ప్రతిష్ఠ

సీతానగరం (తాడేపల్లి రూరల్‌) : విజయకీలాద్రిపై త్రిదండి చినజీయర్‌ స్వామి నిర్మిస్తున్న 9 దేవాలయాల ప్రాంగణంలో ధ్వజ స్తంభ ప్రతిష్టను సోమవారం కనులపండువగా నిర్వహించారు. చినజీయర్‌ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాలపై గోపురాలను ప్రతిష్టించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి  ప్రత్యేక హోమాలు చేశారు. వేదవిద్యార్థుల మంత్రోశ్చరణాల మధ్య ప్రత్యేక పూజలు, ధ్వజస్తంభం ప్రతిష్టించారు. కార్యక్రమంలో ఎంపీ గోకరాజు గంగరాజుతోపాటు క్రేన్‌ వక్కపొడి అధినేత లక్ష్మీకాంతారావు, లీలాచక్రధర్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టను తిలకించేందుకు వచ్చిన భక్తులను ఆశ్రమ నిర్వాహకులు వాహనాలలో కొండపైకి తరలించారు. భక్తులు నవధాన్యాలు చల్లి తమ భక్తిని చాటుకున్నారు.  దేవతావిగ్రహాలను గుడిలో ప్రతిష్టించేందుకు ఆలయం చుట్టూ ప్రదర్శన నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. ఆశ్రమ నిర్వాహకులు వెంకటాచార్యులు, రఘు తదితరులు పాల్గొన్నారు. చినజీయర్‌ స్వామి, దాతల ఆధ్వర్యంలో దేవతామూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement