సమస్యల పరిష్కారం కోసమే డయల్ యువర్ ఎస్పీ
- ఎస్ 2 థియేటర్‌కు వెళ్లే రహదారిలో అడ్డదిడ్డంగా వాహనాలను నిలపడం, ఫుట్‌పాత్‌ను ఆక్రమించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని రామ్మూర్తినగర్‌కు చెందిన డాక్టర్ సుధాకర్‌రెడ్డి చెప్పారు.
- తన తమ్ముడ్ని అతని భార్య ప్రియుడితో కలిసి హత్యచేసిందని, సాక్ష్యులను బెదిరిస్తున్నారని జనార్దన్‌రెడ్డికాలనీకి చెందిన ప్రసాద్ పేర్కొన్నారు.
- తన ఇంట్లో 2013లో దొంగతనం జరిగిందని, ఇంతవరకూ కేసులో ఎలాంటి పురోగతి లేదని గాయత్రీనగర్‌కు చెందిన గిరిజ ఫిర్యాదు చేశారు.
- ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితులను ఇంత వరకూ అరెస్ట్ చేయలేదని కోటకు చెందిన కంచి శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
- తమ ప్రాంతాల్లో బెల్టుషాపుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, వీటిని తొలగించాల్సిందిగా పలువురు కోరారు. సమస్యలపై స్పందించిన డీఎస్పీ విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్బీ డీఎస్పీ కోటారెడ్డి, మహిళా డీఎస్పీ శ్రీనివాసాచారి, తదితరులు పాల్గొన్నారు.