డయల్ యువర్ ఎస్పీకి ఫిర్యాదులు
నెల్లూరు(క్రైమ్):
జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జరిగిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి తొమ్మిది ఫిర్యాదులు అందాయి. ఎస్పీ విశాల్‌గున్నీ, ఎఎస్పీ బి.శరత్‌బాబులు అందుబాటులో లేకపోవడంతో నెల్లూరు రూరల్, నగర, ఎస్‌బీ డీఎస్పీలు తిరుమలేశ్వర్‌రెడ్డి, జి.వెంకటరాముడు, ఎన్.కోటారెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుంచి ఫోన్ల ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. దగదర్తికి చెందిన అరుణమ్మ ఈ ఏడాది నవంబర్ ఒకటో తేదీన తన ఇంట్లో దొంగతనం జరిగిందని, నిందితుడు విషయం పోలీసులకు తెలిపినా ఇంతవరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని పేర్కొంది. విడవలూరుకు చెందిన మనోజ్‌కుమార్ తన భార్యపై తన అన్న దాడిచేశాడని అతనిపై చర్యలు తీసుకోవాలని, నగరానికి చెందిన గిరిబాబు మద్రాçసుబస్టాండ్, పొగతోట ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన నర్సింహారెడ్డి ఆత్మకూరు బస్టాండ్ వద్ద గతేడాది తన తల్లి ఉండగా నగల బ్యాగ్‌ను అపహరించుకొని వెళ్లారనీ ఇంతవరకూ కేసులో ఎలాంటి పురోగతి లేదని, అనంతసాగరం మండలానికి చెందిన విజయ్ తన ఎద్దులను దుండగులు అపహరించుకుని వెళ్లారని ఇంతవరకూ ఎలాంటి న్యాయం జరగలేదని ఫిర్యాదు చేశారు. ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సి.మాణిక్యరావు పాల్గొన్నారు.