సమస్యల పరిష్కారమే లక్ష్యం
నెల్లూరు(క్రైమ్):
బాధితుల సమస్యల సత్వర పరిష్కారమే డయల్ యువర్ ఎస్పీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని జిల్లా అదనపు ఎస్పీ బి. శరత్‌బాబు స్పష్టంచేశారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం జరిగింది.
-
డయల్ యువర్ ఎస్పీలో ఏఎస్పీ శరత్‌బాబు
నెల్లూరు(క్రైమ్):
బాధితుల సమస్యల సత్వర పరిష్కారమే డయల్ యువర్ ఎస్పీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని జిల్లా అదనపు ఎస్పీ బి. శరత్‌బాబు స్పష్టంచేశారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 13 ఫిర్యాదులు అందాయి. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్‌బీ, నగర , మహిళా డీఎస్పీలు ఎన్.కోటారెడ్డి, జి.వెంకటరాముడు, కె.శ్రీనివాసాచారి పాల్గొన్నారు.